తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చాయ్​వాలానే కాదు... చౌకీదారూ గెలిచారు - 2019 లోక్​సభ

2014లో చాయ్​వాలా... 2019లో చౌకీదార్...! భాజపా ప్రచార నినాదాలు. ఈ​ వ్యూహాలు పక్కాగా పనిచేశాయి. కాంగ్రెస్​ను మరో ఐదేళ్ల పాటు అధికారానికి దూరం చేశారు చౌకీదార్​.

చాయ్​వాలానే కాదు.. చౌకీదారూ గెలిచారు

By

Published : May 23, 2019, 7:03 PM IST

'చౌకీదార్​ చోర్​ హై'... భాజపాను ఓడించేందుకు మోదీపై కాంగ్రెస్​ ప్రయోగించిన నినాదం. కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ ఈ పదాన్ని విస్తృతంగా వాడారు. ప్రతి బహిరంగ సభలోనూ చౌకీదార్​ నామం జపిస్తూ ప్రజల్లోకీ తీసుకెళ్లారు. ఫలితం తారుమారు... ప్రయోజనం భాజపాకు. కారణం... కాంగ్రెస్​ ప్రచారాన్ని తిప్పికొట్టడంలో మోదీ సఫలంకావడం. చివరకు... 'చౌకీదార్​ నరేంద్ర మోదీ' రెండో సారి ప్రధానమంత్రిగా అవతరించారు. కాంగ్రెస్​కు మరోసారి నిరాశనే మిగిల్చారు.

అప్పట్లో చాయ్​వాలా...

2014 సార్వత్రికానికి ముందూ ప్రజల్లోకి వెళ్లేందుకు మోదీకి ఉపకరించిన నినాదం చాయ్​వాలా. టీ అమ్మిన నేపథ్యంపై కొందరు కాంగ్రెస్​ నేతలు అవహేళన చేయడాన్ని ప్రచారాంశంగా మలుచుకున్నారు మోదీ. మీలో ఒకరినంటూ... సామాన్య ప్రజానీకానికి చేరువయ్యారు. ఎన్నికల్లో తిరుగులేని ఏకపక్ష విజయం సాధించారు.

ఐదేళ్లు తిరిగాయి. మళ్లీ సాధారణ ఎన్నికలొచ్చాయి. ఇప్పుడు చాయ్​వాలా ఊసే లేదు. చర్చంతా చౌకీదార్​ గురించే. దేశ ఖజానాకు కాపలాదారుడిగా చేస్తానన్నది మోదీ మాట. రఫేల్​ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ.... 'చౌకీదార్​ చోర్​ హై' అన్నది కాంగ్రెస్​ విమర్శ.

చాయ్​వాలా ఫలితమే పునరావృతమైంది. బలహీనతగా మారుద్దామనుకున్న అంశం.. మోదీకి బలాన్ని చేకూరుస్తుందని అనుకోలేదేమో కాంగ్రెస్​.
ఎక్కడ చూసినా చౌకీదార్లే...

2014లో 'చాయ్​వాలా'గా ప్రజలతో పరిచయం పెంచుకొన్న మోదీ.. ఈ సార్వత్రికానికి ముందు 'చౌకీదార్​' పేరుతో ఆ స్నేహబంధం కొనసాగించారు. ప్రతి బహిరంగ సభలోనూ, ఏ వేదికపై అయినా 'ఈ కాపలాదారుకు అవకాశం ఇవ్వండి.. ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటా' అంటూ ప్రజల్లో విశ్వాసం పొందారు. దేశానికి తానే సంరక్షకుడిని అనే భరోసా కలిగించుకున్నారు.

" మీరు నిశ్చింతగా ఉండండి... మీ చౌకీదార్​ అన్ని విధాల అప్రమత్తంగా ఉన్నాడు.''

-- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

ట్విట్టర్​లో...

చౌకీదార్​ పదం ఎంతలా విస్తరించిందంటే.. ట్విట్టర్​లో మార్మోగిపోయేంతలా. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయన ట్విట్టర్​ ఖాతా పేరుకు ముందు చౌకీదార్​ పేరును జోడించారు. కేంద్ర మంత్రులు, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలు, కార్యకర్తలూ అధినేత​ బాటలోనే పయనించారు. అక్కడితో ఆగలేదు. చౌకీదార్​ పదంపై మీమ్స్..​ సామాజిక మాధ్యమాల్లో షికారు చేశాయి.

ఫలించని కాంగ్రెస్​ వ్యూహం...

మోదీ పేరుకు ముందు చౌకీదార్​ చేర్చుకుంటే... కాంగ్రెస్​ నేత హార్దిక్​ పటేల్​ 'బేరోజ్​గార్​' పదాన్ని తీసుకొచ్చారు. నిరుద్యోగం సమస్యను మోదీ పరిష్కరించలేదని విమర్శించడం హార్దిక్​ ఉద్దేశం.

మోదీ ధనవంతులు, బడా వ్యాపారులకే చౌకీదార్​ అంటూ రాహుల్​ ఆరోపించారు. పేదలకు చౌకీదార్​ అవసరం లేదన్నారు ప్రియాంక. ఈ వ్యూహాలు హస్తం పార్టీకి పెద్దగా ప్రయోజనం చేకూర్చలేకపోయాయి.

ఇదీ చూడండి:

అలుపెరుగని ప్రస్థానంలో అతడే ఒక సైన్యం

ABOUT THE AUTHOR

...view details