తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముఖాముఖి: ఐదేళ్లైనా అయ్యర్​ను వీడని 'చాయ్​వాలా' - అయ్యర్

ప్రధాని నరేంద్ర మోదీపై తాను చేసిన 'చాయ్​వాలా' వ్యాఖ్యలకు వివరణ అడిగిన ఈటీవీ భారత్​ విలేకరుపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్.​ కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు, జమ్ము కశ్మీర్​ విభజనపై ​ మణిశంకర్ అయ్యర్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

ముఖాముఖి: ఐదేళ్లైనా అయ్యర్​ను వీడని 'ఛాయ్​వాలా'

By

Published : Aug 14, 2019, 12:03 AM IST

Updated : Sep 26, 2019, 10:36 PM IST

మణిశంకర్​ అయ్యర్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి

కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ విలేకరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్ స్వయం ప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 370 రద్దుపై ఈటీవి భారత్​కు ముఖాముఖి ఇచ్చారు అయ్యర్.

ఈ ఇంటర్వ్యూలో 2014 ఎన్నికల ప్రచారంలో.. నరేంద్ర మోదీపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను విలేకరు గుర్తు చేయగా అయ్యర్ ఆగ్రహంతో ఊగిపోయారు. కశ్మీర్ అంశంపై ప్రశ్నించాలని... గతంపై కాదన్నారు.

నాటి ఎన్నికల ప్రచారంలో తల్కతోరా స్టేడియం వేదికగా తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని వెల్లడించారు. 'ఆయన (మోదీ) ఓటమి ఖాయమని, టీ అమ్మాలనుకుంటే తాము సహాయపడతామనే' తాను వ్యాఖ్యానించినట్లు చెప్పారు.

తాము ఏమీ అడగాలో మీరు ఎలా చెప్తారని విలేకరు అడగగా... వింతగా ప్రవర్తిస్తూ ముఖాముఖి నుంచి తప్పించుకునేందుకు యత్నించారు అయ్యర్​.

ఇదీ చూడండి: 'మహోన్నత వ్యక్తిత్వం సుష్మాస్వరాజ్​ సొంతం'

కశ్మీర్​పై అమెరికాది అదే మొండి వైఖరి!

Last Updated : Sep 26, 2019, 10:36 PM IST

ABOUT THE AUTHOR

...view details