ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో నక్సల్స్ చెలరేగిపోయారు. రాష్ట్రంలో జాతీయ ఖనిజ అభివృద్ధి సంస్థ (ఎన్ఎమ్డీసీ)లో చొరబడి 6 డంపర్ ట్రక్కులు, 3 జేసీబీలకు నిప్పుపెట్టారు.
ఛత్తీస్‌గఢ్‌లో రెచ్చిపోయిన నక్సల్స్- పలు వాహనాలు దగ్ధం - ఛత్తీస్‌గడ్‌లో మైనింగ్ ప్రాంతంలో నక్సల్స్ కాల్పులు
ఛత్తీస్‌గఢ్ దంతెవాడ జిల్లాలో నక్సల్స్ పేట్రేగిపోయారు. మైనింగ్ జరుగుతోన్న ప్రాంతంలో వాహనాలకు నిప్పంటించారు. ఈ ఘటనలో ఆరు డంపర్ ట్రక్కులు, మూడు జేసీబీలు దగ్ధమయ్యాయి.
ఛత్తీస్‌గఢ్‌లో రెచ్చిపోయిన నక్సల్స్- పలు వాహనాలు దగ్ధం
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ లోపే నక్సల్స్ అడవిలోకి పారిపోయారు. గతంలో చాలా సార్లు ఎన్ఎమ్డీసీలో జరుగుతోన్న మైనింగ్ కార్యకలాపాలను అడ్డుకుంటూ నక్సల్స్ దాడులు జరిపినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి : ఖరీదైన 'వైద్యం'.. కనుమరుగవుతున్న 'ఆరోగ్యం
Last Updated : Nov 24, 2019, 6:40 PM IST