తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నలుగురు గిరిజనులను చంపిన నక్సలైట్లు - నలుగురు గిరిజనులను చంపిన నక్సల్స్​

నలుగురు గిరిజనులను నక్సలైట్లు హత్యచేసిన ఘటన ఛత్తీస్​గఢ్ బిజాపుర్​ జిల్లాలో జరిగింది. ముందుగా మాట్లాడేందుకు వారిని పిలిచిన మావోయిస్టులు... సదరు వ్యక్తులు పోలీసులకు ఇన్​ఫార్మర్లుగా పని చేస్తున్నారన్న ఆరోపణలతోనే చంపినట్లు తెలుస్తోంది.

C'garh: Naxals kill four villagers in Bijapur district
నలుగురు గిరిజనులను చంపిన నక్సలైట్లు

By

Published : Sep 5, 2020, 6:20 PM IST

ఛత్తీస్‌గఢ్​ బిజాపుర్ జిల్లా పరిధిలో నలుగురు గిరిజనులను నక్సలైట్లు హత్య చేశారు. గంగలూర్‌ పోలీసు ఠాణా పరిధిలోని దుమ్రి-పల్నార్ గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో రెండ్రోజుల వ్యవధిలో ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇన్​ఫార్మర్ల నెపంతో...

రెండురోజుల క్రితం ఆ చుట్టుపక్కల రెండు గ్రామాల్లోని కొందరిని నక్సలైట్లు మాట్లాడేందుకు పిలిపించుకున్నారు. వీరందరూ అక్కడి రోడ్ల నిర్మాణానికి, అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తున్నారు. వారిపై ప్రజాకోర్టులో విచారణ అనంతరం పోలీస్ ఇన్‌ఫార్మర్ల నెపంతో నక్సలైట్లు చంపారు.

మృతులు పున్సార్‌, మెతపల్‌ గ్రామాలకు చెందిన వారు. వీరందరినీ ఒకేసారి చంపారా లేదా వేర్వేరు సమయాల్లో చంపారా అన్నది తేలాల్సి ఉంది. నక్సలైట్ల దగ్గర మరికొందరు గిరిజనులు బందీలుగా ఉన్నట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details