తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దంతెవాడలో మరో ఇద్దరు నక్సల్స్​ హతం - ఆయుధాలు

ఛత్తీస్​గఢ్​ దంతెవాడలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. వీరిరువురిపై రూ.5 లక్షల రివార్డు ఉంది. మావోయిస్టుగా అనుమానిస్తున్న ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఎన్​కౌంటర్​లో నక్సల్స్ మంగ్లీ, దేవా మృతి

By

Published : Jul 14, 2019, 12:26 PM IST

ఛత్తీస్​గఢ్ దంతెవాడలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు నక్సల్స్ హతమయ్యారు. మావోయిస్టుగా అనుమానిస్తున్న ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గుమియాపాల్​ గ్రామం సమీపంలో పోలీసు దళాలు కూబింగ్ నిర్వహించాయి. వీరిని చూసిన మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు నక్సల్స్​ మరణించగా మిగిలినవారు అడవిలోకి పారిపోయారని పోలీసులు తెలిపారు.

అనంతరం ఘటనా స్థలం నుంచి ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు, రెండు పిస్తోళ్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. మృతులను దేవా, మం​గ్లీ అలియాస్​ ముయిగా గుర్తించారు. మలంగీర్ ఏరియా కమిటీలో ప్రముఖ సభ్యులైన వీరిరువురిపై రూ.5 లక్షల చొప్పున రివార్డు ఉంది.

మావోయిస్టుగా అనుమానిస్తున్న కోసి అనే మహిళనూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి: చంద్రయాన్​-2లో వాల్చంద్ విడి భాగాలు!

ABOUT THE AUTHOR

...view details