తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యోగా దినోత్సవం ప్రధాన వేదిక ఎక్కడంటే...

జూన్​ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి కేంద్రం ఐదు నగరాలను ఎంపిక చేసింది. ప్రధాన వేదికగా దిల్లీని ఎంపిక చేసే అవకాశం ఉంది.

యోగా దినోత్సవం ప్రధాన వేదిక ఎక్కడంటే...

By

Published : Jun 1, 2019, 7:00 PM IST

Updated : Jun 1, 2019, 8:00 PM IST

యోగా దినోత్సవం ప్రధాన వేదిక ఎక్కడంటే...

అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడానికి కేంద్రప్రభుత్వం 5 నగరాలను ఎంపిక చేసింది. దేశరాజధాని దిల్లీతోపాటు సిమ్లా, మైసూర్​, అహ్మదాబాద్​, రాంచీ ఈ జాబితాలో ఉన్నాయి. రెండోసారి కొలువుదీరిన మోదీ ప్రభుత్వం చేపట్టే మొదటి భారీ కార్యక్రమం ఇది.

జూన్​ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించే ప్రధాన వేదికను ఎంపిక చేయడానికి.... ప్రధానమంత్రి కార్యాలయానికి నగరాల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి.

"అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ కోసం ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించాం. ఈ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహిస్తాం."
- ఆయుష్ మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి

వేదిక దిల్లీ అయితే...

పీఎంఓ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాన వేదికగా దిల్లీని ఎంపిక చేస్తే... 2015 తరువాత హస్తిన మళ్లీ ఆ అవకాశం అందిపుచ్చుకున్నట్లు అవుతుంది.
రెండు రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాన్ని... దిల్లీలోని మొరార్జీ దేశాయ్​ నేషనల్​ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ యోగా నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో యోగా గురువులు, నిపుణులు, ఔత్సాహికులు సహా 10 వేలమంది పాల్గొనే అవకాశం ఉంది.

అంతర్జాతీయంగా గుర్తింపు..

సుమారు ఐదు వేల సంవత్సరాలుగా భారత్​లో ప్రాచుర్యంలో ఉన్న యోగాను... ఐక్యరాజ్యసమితి గుర్తించి జూన్​ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. 2014లో ఈ విశిష్ట గుర్తింపు పొందిన తర్వాత... 2015లో మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దిల్లీలోని రాజ్​పథ్​లో నిర్వహించారు. ఆ కార్యక్రమానికి 191 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.

ఇదీ చూడండి: రయ్​ రయ్​: బైక్​లపై కాశీ టు లండన్

Last Updated : Jun 1, 2019, 8:00 PM IST

ABOUT THE AUTHOR

...view details