పశ్చిమ బెంగాల్లో కొనసాగుతున్న హింసాకాండపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. లోక్సభ ఎన్నికలు ముగిసినా రాష్ట్రంలో హింస కొనసాగుతుండటం మమతాబెనర్జీ ప్రభుత్వ వైఫల్యానికి చిహ్నమని విమర్శించింది.
బంగాల్లో లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు కాపాడాలని... ప్రజాశాంతిని నెలకొల్పాలని మమతా బెనర్జీ ప్రభుత్వానికి, కేంద్ర హోంమంత్రిత్వశాఖ సూచించింది.
"గత కొన్ని వారాలుగా రాష్ట్రంలో జరుగుతున్న హింస.. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యాన్ని సూచిస్తోంది. శాంతిభద్రతలు అమలు చేయలేక... ప్రజల్లో నమ్మకాన్ని, విశ్వాసాన్ని నెలకొల్పలేకపోయింది."- కేంద్ర హోంమంత్రిత్వశాఖ