బంగాల్లో రాజకీయ హింసపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ నివేదిక కోరింది. అల్లర్లు నియంత్రించడం సహా ఆయా ఘటనలకు బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ఇప్పటివరకు ఏం చేశారో తెలపాలంటూ ఉత్తర్వులు ఇచ్చింది.
బంగాల్లో నాలుగేళ్లలో జరిగిన రాజకీయ ఘర్షణల్లో సుమారు 160 మంది చనిపోవడాన్ని కేంద్ర హోంశాఖ ప్రస్తావించింది. ఈ స్థాయిలో హింస జరగడంపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది.