తెలంగాణ

telangana

కరోనాపై పోరుకు రూ.15 వేల కోట్లు మంజూరు

By

Published : Apr 9, 2020, 9:43 PM IST

కరోనా వైరస్​తో పోరాడేందుకు భారీగా నిధులు మంజూరు చేసింది కేంద్రం. కొవిడ్​-19 అత్యవసర స్పందన ప్యాకేజీ కింద రూ.15వేల కోట్లు కేటాయించింది. ఈ మొత్తాన్ని విడతలవారీగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

centre-sanctioned-rs-15000-crore-for-states-to-fight-covid-19
కరోనాతో పోరుకు.. రూ.15వేల కోట్లు మంజూరు

కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్​-19 అత్యవసర స్పందన ప్యాకేజీ కింద 15 వేల కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని మంజూరు చేసింది.

కొవిడ్‌-19పై అత్యవసర స్పందన ప్యాకేజీ కింద ఈ మొత్తాన్ని ఖర్చు చేయనుంది. రూ.15 వేల కోట్లలో రూ.7,774 కోట్లను అత్యవసర స్పందన కింద ఖర్చు చేయనుండగా, మిగతా మొత్తాన్ని రాబోయే ఏడాది నుంచి 4 ఏళ్ల కాలంలో వెచ్చించనున్నారు.

ఖర్చు చేసే హక్కు...

వైద్య సదుపాయాల కల్పన, అత్యాధునిక చికిత్సా సౌకర్యాలు, కరోనా వ్యాధి సోకిన వారి కోసం అవసరమైన వైద్య పరికాలు, మందులను కేంద్రీకృత విధానంలో కొనుగోలు చేయడం, ప్రయోగ కేంద్రాల ఏర్పాటు, నిఘా బలోపేతం వంటివి ఈ ప్యాకేజీ ముఖ్య ఉద్దేశం.

ఈ నిధులను జాతీయ ఆరోగ్య మిషన్​, రైల్వేలు, ఆరోగ్య పరిశోధనా విభాగం, జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రాల అభివృద్ధికి వినియోగించే హక్కు ప్రభుత్వానికి ఉందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాలన్నీ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒకే గొడుగు కింద చేపడతారు.

విడతలవారీగా...

ఈ ప్యాకేజీ మొదటి విడత (జనవరి నుంచి జూన్ 2020 వరకు) ఇప్పటికే విడుదల చేసినట్లు తెలిపిన అధికారలు రెండవ విడత (ప్యాకేజీ జులై 2020 నుంచి మార్చి 2021 వరకు) జులైలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 2021 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు తదుపరి విడతలు విడుదలవుతాయన్నారు.

కరోనాపై పోరుకు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటికే రూ.4113 కోట్ల మంజూరు చేసింది ప్రభుత్వం.

ఇదీ చదవండి:'మందుబాబులు మారేందుకు ఇదే అద్భుత అవకాశం'

ABOUT THE AUTHOR

...view details