తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ కాలుష్య నియంత్రణకు కేంద్రం ఆర్డినెన్స్​ - దిల్లీ కాలుష్యం కేంద్రం ఆర్డినెన్స్​

దిల్లీ వాయు కాలుష్య నియంత్రణకు ప్రత్యేక కమిషన్​ ఏర్పాటు చేసింది కేంద్రం. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్​ గెజిట్​ను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి స్థాయి లేదా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి.. ఈ కమిషన్​లో పూర్తికాలం ఛైర్మన్​గా వ్యవహరించనున్నారు.

Centre releases ordinance to tackle Delhi Air pollution
దిల్లీ కాలుష్య నియంత్రణకు కేంద్రం ఆర్డినెన్స్​

By

Published : Oct 29, 2020, 12:34 PM IST

దేశ రాజధాని దిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తూ ఆర్డినెన్స్ గెజిట్ విడుదల చేసిన కేంద్రం.. హరియాణా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలను కూడా ఈ ఆర్డినెన్స్ కిందకు తీసుకువచ్చింది. కమిషన్ చైర్మన్​గా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి స్థాయి లేదా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి పూర్తికాలం చైర్మన్​గా వ్యవహరిస్తారు.

వీరే సభ్యులుగా...

ఎక్స్ అఫిషియో సభ్యుడిగా కేంద్ర అటవీ పర్యవరణ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఉంటారు. పంజాబ్, దిల్లీ, హరియాణా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి ప్రధాన కార్యదర్శి లేదా, పర్యావరణ సంబంధ వ్యవహారాలు చూసే కార్యదర్శి స్థాయి అధికారులు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉంటారు. పర్యావరణ సంబంధిత వ్యవహారాల్లో సాంకేతిక నిపుణులుగా ఉన్న ముగ్గురిని పూర్తికాలం సభ్యులుగా నియమించాలి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి సాంకేతిక సభ్యుడు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా కమిషన్​లో ఉండాలి. ఇస్రో నామినేట్ చేసిన ఒక సభ్యుడు కూడా ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉంటారు. ఎన్జీవోల నుంచి ముగ్గురు వ్యక్తులు కమిషన్​లో సభ్యులుగా ఉంటారు. నీతి ఆయోగ్ నుంచి సంయుక్త కార్యదర్శి లేదా, సలహాదారు స్థాయి అధికారి ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉంటారు.

ఇదీ చూడండి:-కాలుష్య కాసారంగా దిల్లీ- మోగుతున్న ప్రమాద ఘంటికలు

వీరు కాకుండా ఉపరితల రవాణా, విద్యుత్, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ, పెట్రోలియం, వ్యవసాయ, వాణిజ్య మరియు పరిశ్రమల శాఖల నుంచి ఒక్కొక్క అధికారిని సభ్యులుగా నియమించుకునే అవకాశం కమిషన్​కి కేంద్రం కల్పించింది. అధికారుల మధ్య సమన్వయం కోసం కార్యదర్శి స్థాయి అధికారి ఉంటారు. దిల్లీ సరిహద్దు రాష్ట్రాల అధికారులతో సంప్రదింపులు జరుపుతూ దేశ రాజధాని ప్రాంతంలో కాలుష్య నివారణకు తగిన చర్యలు చేపట్టేందుకు అన్ని రకాల అధికారాలు కల్పిస్తూ కమిషన్ ఏర్పాటు చేసింది కేంద్రం. మరోవైపు కాలుష్య నియంత్రణ, చేపట్టాల్సిన చర్యలు, పరిశోధనల కోసం ఉప సంఘాలను కమిషన్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ఉప సంఘాల్లో ఆయా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంటుంది.

ఇటీవల రాష్ట్రాల్లో వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టడం సహా ఇతర కాలుష్య కారకాలు పెరుగుతుండటంపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. విశ్రాంత సుప్రీం కోర్టు న్యాయమూర్తితో ఏకసభ్య కమిషన్​ను ఏర్పాటు చేసింది. అయినా ఆయా రాష్ట్రాల్లో సమన్వయం లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం వల్ల కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలోనే దిల్లీలో పెరుగుతున్న కాలుష్యంపై దృష్టి సారించిన కేంద్రం ఆయా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పిస్తునే ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తూ ఆర్డినెన్స్ గజిట్ తీసుకొచ్చింది.

ఇదీ చూడండి:-దిల్లీ వీధుల్లో గాలిని శుభ్రపరిచే 'గన్స్'​

ABOUT THE AUTHOR

...view details