వచ్చే ఏడాది కూడా పరీక్ష రాసేందుకు మరో అవకాశం ఇవ్వాలన్న సివిల్స్ ఆశావహుల డిమాండ్‌ను పరిశీలిస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.
సివిల్స్ ఆశావహులకు మరో ఛాన్స్‌పై మల్లగుల్లాలు
యూపీఎస్సీ ఆశావహులకు మరో అవకాశం ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్రం. కరోనా కారణంగా ఈ ఏడాది పరీక్షలకు సరిగ్గా సన్నద్ధం కాలేకపోయామని.. తమను వచ్చే ఏడాది కూడా అనుమతించాలని 24 మంది సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
సివిల్స్ ఆశావహులకు మరో అవకాశంపై కేంద్రం మల్లగుల్లాలు
కరోనా కారణంగా ఈ ఏడాది పరీక్షలకు సరిగ్గా సన్నద్ధం కాలేకపోయామని, తమ వయోపరిమితికి.. వచ్చే ఏడాదికి అర్హులం కాదని 24 మంది యూపీఎస్సీ ఆశావహులు సుప్రీంను ఆశ్రయించారు. ఈ రిట్ పటిషిన్పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం యూపీఎస్సీ అధికారులే ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఒకవేళ అధికారుల నిర్ణయం సంతృప్తికరంగా లేకపోతే సివిల్స్ ఆశావహులు న్యాయస్థానంలో సవాల్ చేయవచ్చని జస్టిస్ ఏఎం ఖన్వింకర్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.