తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సీఏఏ సవాల్​' పిటిషన్ల బదిలీకి కేంద్రం అభ్యర్థన - పౌరసత్వచట్టం సవాల్​ పిటిషన్లపై సుప్రీంకు కేంద్రం

దేశవ్యాప్తంగా నిరసనలకు కారణమైన పౌరసత్వ చట్టం(సీఏఏ) అంశంలో సుప్రీం కోర్టును ఆశ్రయించింది కేంద్రం. రాజ్యాంగ బద్ధతను సవాల్​ చేస్తూ వేర్వేరు కోర్టుల్లో దాఖలైన పిటిషన్లంటినీ అత్యున్నత న్యాయస్థానానికి బదిలీ చేయాలని కోరింది. ఈ నెల 10న ఈ వ్యాజ్యంపై వాదనలు విననుంది సుప్రీం.

centre-moves-sc-seeking-transfer-of-pleas-challenging-caa-pending-in-different-hcs-to-top-court
'సీఏఏ సవాల్​' పిటిషన్ల బదిలీకి కేంద్రం అభ్యర్థన

By

Published : Jan 8, 2020, 3:04 PM IST

Updated : Jan 9, 2020, 1:26 AM IST

'సీఏఏ సవాల్​' పిటిషన్ల బదిలీకి కేంద్రం అభ్యర్థన

పౌరసత్వ చట్టం రాజ్యాంగ ప్రామాణికత పిటిషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది కేంద్రం. రాజ్యాంగబద్ధతను సవాల్​ చేస్తూ వివిధ హైకోర్టుల్లో దాఖలై పెండింగ్​లో ఉన్న వ్యాజ్యాలను సర్వోన్నత న్యాయస్థానానికి బదిలీ చేయాలని కోరింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 10న వాదనలు విననున్నట్లు స్పష్టం చేసింది.

''సీఏఏను సవాల్​ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టులే విచారించాలని మేం ప్రాథమికంగా భావించాం. అయితే.. అందులో ఏమైనా వివాదం ఉంటే కనుక మేం పరిశీలిస్తాం.''

- సుప్రీం ధర్మాసనం

కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా... వివిధ హైకోర్టులు విరుద్ధ అభిప్రాయాలను వ్యక్తం చేయొచ్చని, అదే సమస్య అని అన్నారు. విచారణ కోసం న్యాయవాదులు కూడా వివిధ రాష్ట్రాలకు తిరగాల్సి ఉంటుందని వివరించారు.

అంగీకారం... స్టే...

డిసెంబర్​ 18న పౌరసత్య చట్టం రాజ్యాంగ ప్రామాణికతను పరిశీలించేందుకు అంగీకరించింది సుప్రీం కోర్టు. కానీ.. ఈ చట్టం అమలుపై స్టే విధించేందుకు నిరాకరించింది.

పాకిస్థాన్​, బంగ్లాదేశ్​, అఫ్గానిస్థాన్​ నుంచి వచ్చే శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తోంది. అయితే.. దీనిని వ్యతిరేకిస్తూ పలు సంఘాలు, రాజకీయ నేతలు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

Last Updated : Jan 9, 2020, 1:26 AM IST

ABOUT THE AUTHOR

...view details