టెలికాం సంస్థలు బకాయి ఉన్న ఏజీఆర్ చెల్లింపుల ఫార్ములాకు అనుమతించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆర్థికవ్యవస్థపై ప్రభావం లేకుండా ఉండేందుకు టెలికాం సంస్థలు ఏజీఆర్ బకాయిలను 20ఏళ్ల పాటు వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది.
గతంలో ఏజీఆర్ బకాయిల చెల్లింపులపై తీర్పు ఇచ్చిన ధర్మాసనం ముందు ఈ పిటిషన్ లిస్ట్ చేయాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎమ్ఆర్ షాతో కూడిన ధర్మాసనం పేర్కొంది. రూ.1.47 లక్షల కోట్ల బకాయిలు కేంద్రానికి చెల్లించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం 2019, అక్టోబర్ 24న తీర్పు ఇచ్చింది.