తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కరోనా'పై కేంద్రం అలర్ట్​.. నివారణకు తీవ్ర ప్రయత్నాలు

చైనాను వణికిస్తోన్న కరోనా వైరస్​ భారత్​కు పాకింది. సంబంధిత లక్షణాలతో కేరళ విద్యార్థినికి వైరస్​ సోకినట్లు నిర్ధరించారు వైద్యులు. ఈ నేపథ్యంలో వ్యాధి నిర్ధరణ, చికిత్స అందించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​.

centre-making-all-efforts-to-ensure-diagnosis-treatment-of-coronavirus-health-minister
'కరోనా'పై కేంద్రం అలర్ట్​.. నివారణకు తీవ్ర ప్రయత్నాలు

By

Published : Jan 30, 2020, 4:55 PM IST

Updated : Feb 28, 2020, 1:22 PM IST

మహమ్మారి కరోనా వైరస్​ భారత్​కు విస్తరించింది. వుహాన్​లో విద్యనభ్యసిస్తున్న కేరళ విద్యార్థినికి ఈ వైరస్​ సోకినట్లు అధికారులు ధ్రువీకరించారు. అయితే.. ఈ వ్యాధి నిర్ధరణ, వైరస్​ నియంత్రణ చికిత్స కోసం సాధ్యమైన ప్రయత్నాలన్నీ చేస్తున్నట్లు వివరించారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​.

'కరోనా'పై కేంద్రం అలర్ట్​.. నివారణకు తీవ్ర ప్రయత్నాలు

''తొలి కేసు ధ్రువీకరించడానికి ముందు నుంచే ఈ వైరస్​ నిర్ధరణ, చికిత్స కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాం.''

- హర్షవర్ధన్​, కేంద్ర ఆరోగ్య మంత్రి.

కరోనా వైరస్​ లక్షణాలతో భారత్​లో నమోదైన తొలి కేసుకు సంబంధించి.. పూర్తి సమాచారాన్ని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు చెప్పారు హర్షవర్ధన్. ప్రభుత్వం తీసుకుంటున్న మెరుగైన చర్యల ఫలితంగానే ఈ రోజు కేరళ విద్యార్థినికి వైరస్ సోకినట్లు నిర్ధరించడం​ సాధ్యమైందని తెలిపారు.

''మేం ఎన్నో చర్యలు తీసుకుంటున్నాం. 20కిపైగా విమానాశ్రయాలలో ప్రయాణికులకు స్క్రీనింగ్​ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా చైనా నుంచి వస్తున్న వారిపై దృష్టి పెట్టాం. ఈ కారణంగానే ఆ రోగిని గుర్తించగలిగాం.''

- హర్షవర్ధన్​, కేంద్ర ఆరోగ్య మంత్రి.

వైరస్​ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించింది. దేశంలోని అన్ని ప్రధాన విమానాశ్రయాల్లో ప్రయాణికులకు స్క్రీనింగ్​ పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఈ సోమవారం వరకు చైనా నుంచి వచ్చిన మొత్తం 155 విమానాల్లోని 33 వేల 552 ప్రయాణికులకు స్క్రీనింగ్​ నిర్వహించారు.

చైనాలో ఇప్పటివరకు వైరస్​ ప్రభావంతో 170 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది ఈ వైరస్​ సోకి ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు.

Last Updated : Feb 28, 2020, 1:22 PM IST

ABOUT THE AUTHOR

...view details