ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై... కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. జమ్ముకశ్మీర్ అభివృద్ధికి.. ఆర్టికల్ 370 ఆటంకంగా మారిందన్న కేంద్రం... దీని వల్ల వేర్పాటువాదులు, తీవ్రవాదులు ప్రయోజనం పొందినట్లు అఫిడవిట్‌లో వెల్లడించింది.
'అధికరణ 370.. వేర్పాటువాదులకే ప్రయోజనం చేకూర్చింది' - సుప్రీంకోర్టులో ఆర్టికల్ 370ని రద్దు
సుప్రీంకోర్టులో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ దాఖలైన పిటిషన్లపై.. కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. అధికరణ 370... వేర్పాటు వాదులు, తీవ్రవాదులకు ప్రయోజనకరంగా ఉందని కోర్టుకు తెలిపింది.
'ఆర్టికల్ 370 వేర్పాటు, తీవ్రవాదులకు ప్రయోజనకరంగా ఉంది.'
జమ్ముకశ్మీర్‌లో పెట్టుబడులకు, యువతకు ఉపాధి కల్పించేందుకు 35-ఏ అడ్డుగా మారిందని పేర్కొంది. దేశం, జమ్ముకశ్మీర్ ప్రయోజనాల కోసమే ఆర్టికల్ 370ను రద్దు చేశామని వివరించింది. ఈ అంశంపై ఈ నెల 14న సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
ఇదీ చూడండి:మహా ట్విస్ట్: ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీకి గవర్నర్ పిలుపు