తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహిళల భద్రతకు కేంద్రం మార్గదర్శకాలు - centre advisory on women safety

హాథ్రస్​ ఘటనతో దేశవ్యాప్తంగా 'మహిళల భద్రత 'అంశంపై నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు పలు సూచనలు నిర్దేశించింది. మహిళలపై జరుగుతున్న నేరాలను కట్టడి చేసేందుకు, పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంది.

Centre issues fresh advisory to states on women safety; says police must adhere to laid down norms
మహిళల భద్రతకు మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం

By

Published : Oct 10, 2020, 7:58 PM IST

హాథ్రస్​ ఘటన నేపథ్యంలో.. మహిళల భద్రత విషయంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు పలు సూచనలు జారీ చేసింది. లైంగిక నేరాలపై పోలీసులు తప్పనిసరిగా చర్యలు చేపట్టాలని ఈ మార్గదర్శకాల్లో పేర్కొంది.

జీరో ఎఫ్​ఐఆర్​ తప్పనిసరి

నేరం ఏ ప్రాంతంలో జరిగినా.. ఇందుకు సంబంధించి దేశంలోని ఏ పోలీస్​స్టేషన్​లోనైనా ఫిర్యాదు చేసే విధంగా కేంద్రం 'జీరో ఎఫ్​ఐఆర్'​ను రూపొందించింది. మహిళలపై లైంగికదాడికి పాల్పడితే అది కేసుపెట్ట దగిన నేరంగా పరిగణించాలి, కచ్చితంగా ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాలని స్పష్టం చేసింది.

పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తే..

లైంగిక వేధింపుల కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా పోలీసులు, అధికారులు సహకరించాలి. ఈ కేసుల్లో పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

ABOUT THE AUTHOR

...view details