తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజ్యసభ వాయిదా.. లోపలే నిరసనకు దిగిన విపక్షాలు - rajyasabha updates

centre-introduces-agriculture-bills-in-rajya-sabha-amid-controversy
వ్యవసాయ బిల్లులపై రాజ్యసభలో వాడీవేడి చర్చ

By

Published : Sep 20, 2020, 8:59 AM IST

Updated : Sep 20, 2020, 9:43 PM IST

14:42 September 20

నడ్డా విమర్శలు..

వ్యవసాయ బిల్లులను సభలో ఆమోదించే సమయంలో.. విపక్షాలు అత్యంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించాయని అన్నారు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా. ఇది ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. 

14:40 September 20

సభ వాయిదా పడినా విపక్షాల నిరసన..

వ్యవసాయ బిల్లులకు ఆమోదం లభించిన అనంతరం.. రాజ్యసభ వాయిదా పడింది. అయినప్పటికీ కాంగ్రెస్​ సహా.. ఇతర విపక్ష పార్టీలు ఎగువసభ లోపలే నిరసనకు దిగాయి. 

13:59 September 20

వ్యవసాయం రంగంలో సంస్కరణల కోసం కేంద్రం ప్రతిపాదించిన బిల్లులకు పార్లమెంటు ఆమోదం లభించింది. ఇప్పటికే లోక్​సభ గడప దాటిన ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌ (ప్రమోషన్‌ అండ్‌ ఫెసిలిటేషన్‌), ఫార్మర్స్‌ (ఎంపవర్‌మెంట్‌ అండ్‌ ప్రొటెక్షన్‌) అగ్రిమెంట్‌ ఆన్‌ ప్రైస్‌ అష్యూరెన్స్‌ అండ్‌ ఫామ్‌ సర్వీసెస్‌ బిల్లులను గందరగోళం మధ్య రాజ్యసభ ఆమోదించింది. బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ సభ్యులు కేంద్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. కార్పొరేట్ శక్తులకు మేలు చేకుర్చేందుకు వీటిని తీసుకొచ్చారని ధ్వజమెత్తారు.

'బిల్లులు కాదు డెత్​ వారెంట్లు'

వ్యవసాయ సంస్కరణల పేరుతో కేంద్రం తీసుకొచ్చిన బిల్లులు రైతుల పాలిట డెత్​ వారెంట్లు అని ధ్వజమెత్తారు కాంగ్రెస్ ఎంపీ ప్రతాప్​ సింగ్ బజ్వా. భూ యజమానులకు వ్యతిరేకమైన ఈ బిల్లులను కాంగ్రెస్ అంగీకరించే ప్రసక్తే లేదని తెలిపారు. కనీస మద్దుతు ధరను నీరు గార్చే విధంగా బిల్లులు ఉన్నాయని ఆరోపించారు. కరోనా కష్ట సమయంలో ఇలాంటి బిల్లులు తీసుకురావాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు.

'మోదీ వాగ్దానాలకు విశ్వసనీయత లేదు'

వ్యవసాయ బిల్లులపై ప్రజలను విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు టీఎంసీ సభ్యుడు డెరెక్​ ఓబ్రయన్​. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న మోదీ వాగ్దానాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత ధరలతో రైతుల ఆదాయం 2028 వరకు కూడా పెరగదన్నారు. మోదీ హామీలకు విశ్వసనీయత లేదని విమర్శించారు. ఈ బిల్లులను పార్లమెంటు ఎంపిక కమిటీ పరిశీలనకు పంపాలని డిమాండ్ చేశారు.

'బానిసలు అవుతారు'

దేశ జీడీపీలో 20శాతాన్ని సమకూర్చే రైతులు.. కేంద్రం ప్రతిపాదించిన బిల్లుల కారణంగా బానిసలుగా మారుతారని డీఎంకే సభ్యుడు టీకేఎస్ ఇళంగోవన్ అన్నారు. ఇవి రైతులకు మృత్యు ఘంటికలు అవుతాయని, వారిని ఒక సరకుగా మారుస్తాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

రైతు వ్యతిరేకం

కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు రైతు వ్యతిరేకంగా ఉన్నాయని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్‌గోపాల్‌ యాదవ్‌ విమర్శించారు. కార్పొరేట్ల విస్తరణకు దోహద పడేలా ఈ బిల్లులు రూపొందించారని ఆరోపించారు. ఇంత కీలకమైన బిల్లులను తీసుకొచ్చేటప్పుడు ప్రతిపక్ష నేతలు, దేశంలోని రైతు సంఘాలతో చర్చించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు.

ఆదాయం రెట్టింపు అవుతుందా?

బిల్లుల ద్వారా రైతుల ఆదాయం రెట్టింపవుతుందని ప్రభుత్వం హామీ ఇస్తుందా? అని శివసేన ఎంపీ సంజయ్​ రౌత్ ప్రశ్నించారు. రైతులు ఇకపై ఆత్మహత్యలు చేసుకోరని హామీ ఇస్తారా? కేంద్రాన్ని అడిగారు. బిల్లుపై చర్చకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలన్నారు.

తప్పుడు ప్రచారం..

బిల్లులపై కాంగ్రెస్ తప్పుడు ప్రాచారం చేస్తోందని భాజపా నేత భూపేంద్ర యాదవ్ ఆరోపించారు. వారి 70 ఏళ్ల పాలనలో రైతుల ఆదాయం పెరిగిన దాఖలాలు లేవన్నారు. కేంద్రం తీసుకొచ్చే సంస్కరణలతో రైతులు మేలు జరుగుతుందని ఉద్ఘాటించారు. కనీస మద్దతు ధరపై ప్రభావం ఉండదని చెప్పారు.

తీవ్ర గందరగోళం

బిల్లులపై చర్చ తర్వాత రాజ్యసభలో తీవ్ర దుమారం రేగింది. బిల్లులను ఆమోదం కోసం అధికార పక్షం ప్రతిపాదన చేసేందుకు సిద్ధమవగా... విపక్షాలు వ్యతిరేకించాయి. టీఎంసీ సభ్యుడు డెరెక్ ఓబ్రయన్, ఇతర సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లారు. ఫలితంగా గందరగోళం ఏర్పడగా... సభ కాసేపు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమయ్యాక విపక్ష సభ్యుల నినాదాల మధ్యే వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందాయి. సభ సోమవారానికి వాయిదా పడింది.

13:50 September 20

వ్యవసాయ బిల్లుల్లో ఒకదానికి రాజ్యసభ ఆమోదం లభించింది.

13:45 September 20

వాయిదా తర్వాత సభ తిరిగి ప్రారంభమైంది.

13:28 September 20

వ్యవసాయ బిల్లులపై రాజ్యసభలో వాడీవేడి చర్చ జరగింది. బిల్లుల ఆమోదానికి ప్రయత్నించిన అధికార పక్షాన్ని విపక్షాలు అడ్డుకున్నాయి. టీఎంసీ సభ్యుడు డెరెక్ ఒబ్రెయిన్ వెల్​లోకి దూసుకెళ్లారు. గందరగోళం నేపథ్యంలో సభ వాయిదా పడింది.

13:21 September 20

  • వ్యవసాయ బిల్లులపై రాజ్యసభలో చర్చ
  • రాజ్యసభలో వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించిన విపక్షాలు
  • బిల్లును ఉపసంహరించుకోవాలంటూ విపక్షాల ఆందోళన
  • బిల్లుపై సందేహాలకు ప్రధాని సమాధానం చెప్పాలంటూ జేడీఎస్‌ డిమాండ్‌
  • కొత్త చట్టం వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలేమిటో చెప్పాలన్న మాజీ ప్రధాని దేవెగౌడ
  • కరోనా విపత్కర పరిస్థితుల్లో బిల్లును ఆగమేఘాల మీద ప్రవేశపెడుతున్నారని దేవెగౌడ విమర్శ
  • డిప్యూటీ ఛైర్మన్‌ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెల్పిన పలువురు ఎంపీలు

11:32 September 20

  • రాజ్యసభలో కొత్త వ్యవసాయ బిల్లును వ్యతిరేకించిన తెరాస ఎంపీలు
  • రాష్ట్రాల హక్కులను హరించేలా కొత్త వ్యవసాయ చట్టం ఉంది: ఎంపీ కేశవరావు
  • ఈ కొత్త చట్టం రైతులకు అండగా నిలిచేలా లేదు: ఎంపీ కేశవరావు
  • వ్యవసాయంలో కూడా కార్పొరేట్లను పెంచేలా ఈ కొత్త చట్టం ఉంది: ఎంపీ కేశవరావు

11:28 September 20

కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు రైతు వ్యతిరేకంగా ఉన్నాయని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్‌గోపాల్‌ యాదవ్‌ విమర్శించారు. కార్పొరేట్ల విస్తరణకు దోహద పడేలా ఈ బిల్లులు రూపొందించారని ఆరోపించారు. ఎలాంటి చర్చ, వాదోపవాదాలు లేకుండానే ఈ బిల్లులు ఆమోదం పొందాలని అధికార పార్టీ కోరుకుంటోందన్నారు. ఇంత కీలకమైన బిల్లును తీసుకొచ్చేటప్పుడు ప్రతిపక్ష నేతలు, దేశంలోని రైతు సంఘాలతో మీరు చర్చించాలని..  కానీ కరోనా వైరస్‌ పేరు చెప్పి ఎవరినీ అడగకుండా బిల్లులను తీసుకొచ్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

11:18 September 20

కాంగ్రెస్​ను ఉద్దేశించి వైకాపా సభ్యుడు వీవీ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతరం సభలో కాసేపు దుమారం చెలరేగింది. కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వీవీ రెడ్డి వ్యాఖ్యలు రికార్డులోకి వెళ్లవని ఛైర్మన్​ తెలిపారు.

10:47 September 20

ఈ బిల్లుతో రైతులు బానిసలవుతారు..

దేశ జీడీపీలో 20శాతాన్ని సమకూర్చే రైతులు.. కేంద్రం ప్రతిపాదించిన బిల్లుల కారణంగా బానిసలుగా మారుతారని డీఎంకే సభ్యుడు టీకేఎస్ ఎలంగోవన్ అన్నారు.  ఇవి రైతులకు మృత్యు ఘంటికలు అవుతాయని, వారిని ఒక సరకుగా మారుస్తాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

10:26 September 20

వ్యవసాయ బిల్లులపై ప్రజలను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రధాని నరేంద్ర  మోదీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు టీఎంసీ సభ్యుడు డెరెక్​ ఓబ్రయన్​. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న కేంద్రం వాగ్దానాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత ధరలతో రైతుల ఆదాయం 2028 వరకు కూడా పెరగదన్నారు. మోదీ హామీలకు విశ్వసనీయత లేదని విమర్శించారు. ఈ బిల్లులను పార్లమెంటు సెలక్ట్ కమిటీ పరిశీలనకు పంపాలన్నారు డెరెక్​. ఈ మేరకు తీర్మానం కూడా ప్రవేశ పెట్టారు.

10:10 September 20

  • రైతు, వ్యవసాయ సంబంధ బిల్లులు చరిత్రాత్మకమైనవి: తోమర్‌
  • రైతుల జీవన ప్రమాణాలు మరింత మెరుగుకు దోహదం: తోమర్‌
  • రైతులు తమ ఉత్పత్తులను స్వేచ్ఛగా బహిరంగ మార్కెట్‌లో విక్రయించవచ్చు: తోమర్‌
  • ఈ బిల్లులు కనీస మద్దతు ధరకు సంబంధించినవి కావు: తోమర్‌
  • ప్రభుత్వం వ్యవసాయ రంగంలో అతిపెద్ద సంస్కరణలు తెచ్చింది: భూపేందర్‌యాదవ్‌
  • 70 ఏళ్లలో ఎన్నడూ చూడని సంస్కరణలను ప్రభుత్వం తెచ్చింది: భూపేందర్‌యాదవ్‌
  • నవతరానికి మరింత ఊతమిచ్చే విధంగా బిల్లులు ఉన్నాయి: భూపేందర్‌యాదవ్‌
  • విపక్షాలు.. రైతులను కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణిస్తాయి: భూపేందర్‌యాదవ్‌
  • భాజపా ప్రభుత్వం మాత్రం రైతులను దేశాన్ని ముందుకు నడిపే శక్తిగా చూస్తుంది: భూపేందర్‌యాదవ్‌

09:56 September 20

దేశంలో 70 సంవత్సారాలుగా రైతులకు సరైన న్యాయం జరగడం లేదని, తాము ప్రతిపాదించిన సంస్కరణలతో వారికి ఎట్టకేలకు లాభం చేకూరుతుందని భాజపా సభ్యుడు భూపేందర్ యాదవ్ అన్నారు.

09:40 September 20

వ్యవసాయ బిల్లులపై రాజ్యసభలో చర్చ జరుగుతోంది. వీటిని తాము వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ సభ్యుడు ప్రతాప్​ సింగ్ బజ్వా తెలిపారు. ఈ బిల్లుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని, కార్పొరేట్ శక్తులకు మేలు జరుగుతుందన్నారు. రైతులకు డెత్​వారెంట్ లాంటి ఈ బిల్లులను అంగీకరించే ప్రసక్తే లేదని ప్రతాప్​ సింగ్​ తేల్చి చెప్పారు.

09:30 September 20

కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్​ వ్యవసాయ బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టారు.

09:20 September 20

మాజీ ప్రధాని, జేడీఎస్ నేత హెజ్​డీ దేవెగౌడ రాజ్యసభ సభ్యునిగా ప్రమాణం చేశారు.

08:16 September 20

సాగు బిల్లులపై రగడ.. రాజ్యసభ వాయిదా

వివాదాలకు దారితీసిన వ్యవసాయ బిల్లులను రాజ్యసభలో ప్రవేశ పెట్టనుంది కేంద్రం. ప్రతిపక్షాలు వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూలంగా బిల్లులను ప్రతిపాదించారని ఆరోపిస్తున్నాయి.

భాజపా నేతల ధీమా..

మరోవైపు బిల్లుల ఆమోదం కోసం చాలా ప్రాంతీయ పార్టీల మద్దతుకు భాజపా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే భాజపా నేతృత్వంలోని ఎన్​డీఏకు రాజ్యసభలో స్పష్టమైన మెజారిటీ ఉంది. బిల్లుల ఆమోదంపై భాజపా నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అన్నాడీఎంకే, వైఎస్​ఆర్​ కాంగ్రెస్​ సహా 130 మంది సభ్యుల మద్దతు భాజపాకు ఉంది.

కొంతకాలంగా కేంద్రం ప్రతిపాదించిన వివిధ చట్టాలకు ప్రాంతీయ పార్టీలు మద్దతు తెలుపుతూ వస్తున్నాయి. అయితే, తెరాస మాత్రం ఈ బిల్లులకు వ్యతిరేకంగా ఓటువేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లులతో రైతులకు అన్యాయం జరుగుతుందని ఆరోపించిన సీఎం కేసీఆర్.. ఈ మేరకు తెరాస ఎంపీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

ఇప్పటికే లోక్​సభలో ఆమోదం పొందినప్పటికీ.. బిల్లులపై భాజపా మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్​ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

రాజకీయ దుమారం..

వ్యవసాయ రంగ సంస్కరణల్లో భాగంగా కేంద్రం ప్రతిపాదించిన మూడు చట్టాలపై భాజపా, విపక్షాల మధ్య రాజకీయ దుమారం చెలరేగుతోంది. ముఖ్యంగా భాజపా మిత్రపక్షం అకాలీదళ్​.. ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కేంద్ర మంత్రి పదవికి హర్​సిమ్రత్​ కౌర్​ బాదల్ రాజీనామా చేశారు.

అయితే, బిల్లులపై విపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని భాజపా నేతలు మండిపడ్డారు. రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు.

Last Updated : Sep 20, 2020, 9:43 PM IST

ABOUT THE AUTHOR

...view details