ల్యాండ్‌లైన్ ఫోన్లు, సాదారణ ఫీచర్ ఫోన్లను ఆరోగ్యసేతు మొబైల్ యాప్‌తో అనుసంధాం చేయడమే లక్ష్యంగా కేంద్రం.. ఆరోగ్య సేతు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్- ఐవీఆర్ఎస్ను తీసుకొచ్చింది. కరోనా కట్టడిలో భాగంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే తెలిపింది. ఆరోగ్య సేతు ఐవీఆర్ఎస్ అన్నది దేశవ్యాప్తంగా అందుబాటులో ఉండే టోల్‌ఫ్రీ నెంబర్ అని పేర్కొన్న కేంద్రం.. ప్రజలు ఆ టోల్‌ఫ్రీ నెంబర్ 1921కి మిస్స్‌డ్ కాల్ ఇవ్వాలని తెలిపింది.
ఇకపై ల్యాండ్‌లైన్ ఫోన్లలోనూ ఆరోగ్య సేతు యాప్! - ఆరోగ్య సేతు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాస్స్ సిస్టమ్ (ఐవీఆర్ఎస్)
కరోనా బాధితులను గుర్తించడం కోసం తీసుకువచ్చిన ఆరోగ్యసేతు యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌కే పరిమితం కాకుండా ల్యాండ్‌లైన్, ఇతర సాధారణ ఫీచర్ ఫోన్లకు కూడా అనుసంధానం చేయనుంది కేంద్రం. ఇందు కోసం ఆరోగ్య సేతు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాస్స్ సిస్టమ్ (ఐవీఆర్ఎస్)ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
![ఇకపై ల్యాండ్‌లైన్ ఫోన్లలోనూ ఆరోగ్య సేతు యాప్! Centre incorporates IVRS service in Aarogya Setu app](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7089097-thumbnail-3x2-asp.jpg)
ఇకపై ల్యాండ్‌లైన్ ఫోన్లలో కూడా ఆరోగ్య సేతు యాప్
వెంటనే వారి ఫోన్‌కి కాల్ వస్తుందని.. సదరు పౌరుడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడానికి కొన్ని ప్రశ్నలు వినిపిస్తాయని తెలిపింది. ఆ ప్రశ్నలకు వచ్చిన సమాధానాల మేరకు వారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఫోన్‌కు సంక్షిప్త సందేశం రూపంలో నివేదిక వస్తుంది. టోల్‌ఫ్రీ సేవలు 11 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంటాయి.