భారత్- చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత రక్షణ దళాలకు ప్రత్యేక ఆర్థికశక్తిని ఇచ్చింది. రూ.500 కోట్లలోపు అత్యాధునిక యుద్ధ సామగ్రిని కొనుగోలు చేసుకునేందుకు వీలుగా త్రివిధ దళాలకు అధికారం ఇచ్చింది.
'త్రివిధ దళాలకు ఆర్థికశక్తిని అందించే కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వం అత్యవసరాల నిమిత్తం రూ.500కోట్లలోపు ఆయుధాలను కొనుగోలు చేయడం, లేదా అప్‌గ్రేడ్ చేసుకునేలా ప్రత్యేక అధికారాలను ఇచ్చింది. దీని ద్వారా నూతన, అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేసే వీలు కలుగుతుంది' అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఈ నిధుల ద్వారా ఆర్మీ సరికొత్త ఆయుధాలను సమకూర్చుకోనుంది. త్రివిధ దళాలు ఇప్పటికే ఎలాంటి ఆయుధాలను కొనుగోలు చేయాలన్న దానిపై కసరత్తు ప్రారంభించాయి. ఆయుధాల జాబితాను సిద్ధం చేసుకొంటున్నాయి.