తెలంగాణ

telangana

By

Published : Nov 5, 2019, 1:16 PM IST

Updated : Nov 5, 2019, 2:11 PM IST

ETV Bharat / bharat

అయోధ్య తీర్పు దృష్ట్యా యూపీకి 4 వేల మంది బలగాలు

దశాబ్దాల నాటి అయోధ్య భూవివాదం కేసుకు సంబంధించి త్వరలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో ఉత్తర్​ప్రదేశ్​లో 4 వేల మంది బలగాలను మోహరించింది కేంద్రం. ఈ భద్రతా దళాలు నవంబర్ 11 నుంచి​ 18 వరకు రాష్ట్రంలోనే ఉంటాయి.

శాంతి భద్రతల దృష్ట్యా యూపీకి 4 వేల మంది బలగాలు

అయోధ్య తీర్పు దృష్ట్యా యూపీకి 4 వేల మంది బలగాలు
అయోధ్య రామజన్మ భూమి- బాబ్రీ మసీదు కేసులో సుప్రీం కొద్ది రోజుల్లో వెలువరించనున్న తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అయితే తీర్పు తర్వాత ఇరు వర్గాల మధ్య ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా కేంద్రం ముందుస్తు చర్యలు చేపట్టింది. ఉత్తర్​ప్రదేశ్​లో దాదాపు 4 వేల మంది కేంద్ర బలగాలను మోహరించింది హోంశాఖ.

సీఆర్​పీఎఫ్​, సీఐఎస్​ఎఫ్​, బీఎస్​ఎఫ్​, ఐటీబీపీ, ఎస్​ఎస్​బీ సహా మొత్తం 40 వేరు వేరు భద్రతా దళాల నుంచి జవాన్లను ఇందులో భాగస్వాముల్ని చేసింది కేంద్రం. నవంబర్​ 11 నుంచి నవంబర్ 18 వరకు భద్రతా బలగాలు ఇక్కడే విధులు నిర్వహిస్తాయని స్పష్టం చేసింది.

లఖ్​నవూ, అలీగఢ్​​, కాన్పుర్​ వంటి 12 సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ బలగాలు భద్రత చేపడతాయి. అంతే కాక, దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా అన్ని రాష్ట్రాల పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేసింది కేంద్రం.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి నవంబర్​ 17న పదవీ విరమణ చేయనున్నారు. ఈలోపు అయోధ్య కేసులో తీర్పు వెలువడే అవకాశముంది.

ఇదీ చూడండి:అయోధ్య కేసు తీర్పు విజయోత్సవాలపై ఆంక్షలు

Last Updated : Nov 5, 2019, 2:11 PM IST

ABOUT THE AUTHOR

...view details