తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వచ్చే జూన్​ నాటికి 'ఒకే దేశం-ఒకే రేషన్​ కార్డు'

2020 జూన్ 30 లోగా 'ఒకే దేశం-ఒకే రేషన్ కార్డు' విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది కేంద్రం. 'ఒకే దేశం-ఒకే రేషన్ కార్డు' విధివిధానాలను ప్రకటించారు కేంద్ర పౌర సరఫరాల మంత్రి రామ్​ విలాస్ పాసవాన్.

ఏడాదిలోగా అన్ని రాష్ట్రాల్లో 'ఒకే దేశం-ఒకే రేషన్​ కార్డు '

By

Published : Jun 30, 2019, 5:16 AM IST

'ఒకే దేశం-ఒకే రేషన్​కార్డు' విధానాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయనున్నామని ఇటీవలే ప్రకటించిన కేంద్రం.. ఆ దిశగా అడుగులు వేసింది. 2020 జూన్ 30 లోగా ఒకే రేషన్ కార్డు విధానాన్ని కచ్చితంగా అనుసరించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది. ఈ ఒకే రేషన్​ విధానం ద్వారా దేశంలో ఎక్కడి నుంచైనా రేషన్​ సరుకులను పొందే వెసులుబాటు కల్పించారు. ఇప్పటికే 10 రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థ విధానం సాంకేతికంగా ఒకే రేషను కార్డుకు అనుకూలంగా ఉందని కేంద్రం తెలిపింది.

మోదీ 2.0 ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల అజెండా మేరకే ఒకే రేషన్ కార్డు విధానాన్ని అమలు పరుస్తున్నారు. 2016 నుంచి కేంద్రం చాలా తక్కువ ధరకే రాయితీతో రేషను సరకులను అందిస్తోంది.

నూతన రేషన్​ కార్డు విధానంలో లబ్ధిదారులు కేవలం ఆధార్​ కార్డును చూపించినా సరిపోతుందన్నారు పాసవాన్. ఒక కార్డు ద్వారా వచ్చే సరకులో కొంత భాగాన్ని ఒక ప్రాంతంలోనూ, మిగిలిన భాగాన్ని వేరే చోటు నుంచి తీసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు.

ఏడాదిలోగా అన్ని రాష్ట్రాల్లో 'ఒకే దేశం-ఒకే రేషన్​ కార్డు '

"2020 జులై 1 నాటికి 'ఒకే దేశం-ఒకే రేషన్ కార్డు' విధానం అమలు చేయాలని నిర్ణయించాం. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లి పని చేసుకునే పేదలు రేషన్​ సరకులు తీసుకునేందుకు వీలుగా ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నాం."

-రాంవిలాస్ పాసవాన్,కేంద్రమంత్రి

ఇదీ చూడండి: 'విపత్తు నిర్వహణలో అగ్రగామిగా భారత్'

ABOUT THE AUTHOR

...view details