ట్రాన్స్జెండర్లకు సమాజంలో సమానత్వం కల్పించడం సహా ఆ దిశగా విధానాలు, చట్టాలు రూపకల్పన చేసేందుకు జాతీయ మండలిని ఏర్పాటు చేసింది కేంద్రం. ట్రాన్స్జెండర్ల చట్టం 2019 ద్వారా ఈ మండలిని ఏర్పాటు చేసినట్లు గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించింది.
ట్రాన్స్జెండర్ల కోసం రూపొందించే విధివిధానాలు, చట్టాలు, ప్రాజెక్టులపై కేంద్రానికి సలహాలు ఇవ్వడంలో ఈ మండలి కీలకంగా వ్యవహరిస్తుంది. కేంద్రం తీసుకొచ్చే చట్టాల అమలు తీరును పర్యవేక్షిస్తుంది. దీంతోపాటు ఈ చట్టాలు వారిపై ఏమేరకు ప్రభావం చూపుతాయో అంచనా వేస్తుంది. ట్రాన్స్జెండర్ల సమస్యలపై పనిచేస్తున్న ప్రభుత్వంలోని ఇతర శాఖలు, ప్రభుత్వేతర సంస్థల పనితీరును విశ్లేషిస్తుంది.
సభ్యులు వీరే..