జమ్ముకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాతే ఎన్నికలు జరుగుతాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కశ్మీర్ ప్రజల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.
అక్టోబర్ 31న రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు(కశ్మీర్, లద్దాఖ్)గా కశ్మీర్ రూపాంతరం చెందనుందని... డిసెంబర్‌లోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని బెంగళూరులో మీడియా సమావేశంలో స్పష్టం చేశారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి.
"గతంలో కశ్మీర్లో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారిన అనంతరం నవంబర్-డిసెంబర్‌లోగా మండల పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తాం. ఆ తర్వాత జిల్లా పరిషత్ ఎన్నికలు జరుగుతాయి. జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌ను అభివృద్ధి చేసేందుకు మేము రచించిన ప్రణాళికలకు ఈ ఎన్నికలు ఊతమందిస్తాయి."
--- కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి.