తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భారత్​లో 2021 జులైకి 25 కోట్ల మందికి వ్యాక్సిన్'

కరోనా వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చిన అనంతరం దానిని దేశ ప్రజలకు అందించే ప్రక్రియపై కేంద్రం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది జులై నాటికి.. 40-50కోట్ల వ్యాక్సిన్​ డోసులను 20-25 కోట్ల మంది ప్రజలకు అందించే అవకాశముందని అంచనా వేస్తున్నట్టు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్​ వెల్లడించారు. ఇందుకు సంబంధించి ప్రాధాన్యతలతో కూడిన జాబితాను ఈ నెలాఖరులోగా అందించాలని అన్ని రాష్ట్రాలను అదేశించినట్టు స్పష్టం చేశారు.

centre-estimates-to-utilise-40-50-cr-covid-19-vaccine-doses-on-20-25-cr-people-by-july-2021-vardhan
'2021 జులై నాటికి 25కోట్ల మందికి వ్యాక్సిన్'

By

Published : Oct 4, 2020, 4:48 PM IST

2021 జులై నాటికి 40-50కోట్ల కరోనా వ్యాక్సిన్​ డోసులను 20-25కోట్ల మంది ప్రజలకు అందించే అవకాశముందని కేంద్రం అంచనా వేస్తోంది. ఇందుకు తగ్గట్టుగా ఇప్పటికే ప్రణాళికలు రచిస్తోంది. ఎవరెవరికి తొలుత వ్యాక్సిన్​ అందించాలనే జాబితాను రూపొందించి.. ఈ నెలాఖరులోగా సమర్పించాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్​ వెల్లడించారు.

ఉన్నతస్థాయి నిపుణుల బృందం... వ్యాక్సిన్​కు సంబంధించిన అన్ని కోణాలను పరిశీలిస్తోందని తెలిపారు హర్షవర్ధన్​. సామాజిక మాధ్యమంలో జరిపిన 'సండే సంవాద్​' కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆరోగ్య కార్యకర్తలకే...

కరోనాపై పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తామని ఆరోగ్యమంత్రి పేర్కొన్నారు. ఈ జాబితాలో ప్రభుత్వ- ప్రైవేటు రంగాలకు చెందిన వైద్యులు, నర్సులు, పారామెడికోలు, పారిశుద్ధ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, నిఘా అధికారులు ఉంటారని కేంద్రమంత్రి వెల్లడించారు. ట్రేసింగ్​, టెస్టింగ్​, ట్రీట్​మెంట్​లో భాగమైన వారందరూ ఈ జాబితాలో ఉంటారని స్పష్టం చేశారు.

మరోవైపు టీకా సరఫరాకు కావాల్సిన వసతులను ఏర్పాటు చేసేందుకు కూడా కేంద్రం ప్రణాళికలు రచిస్తోందని హర్షవర్ధన్​ వెల్లడించారు.

"400-500మిలియన్​ డోసులను అందించేందుకు కావాల్సిన మానవ వనరులు, శిక్షణ, పర్యవేక్షణ, ఇతర భారీస్థాయి వసతులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది కేంద్రం. ఇవన్నీ తుది దశకు చేరుకున్నాయి."

--- హర్షవర్ధన్​, కేంద్ర ఆరోగ్యమంత్రి.

ఇదీ చూడండి:-మూడు నెలల్లో అందుబాటులోకి ఆక్స్​ఫర్డ్ టీకా!

ABOUT THE AUTHOR

...view details