కరోనా ఆసుపత్రులను మూడు విభాగాలుగా వర్గీకరించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్దేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకూ మార్గదర్శకాలు జారీచేసింది. కొవిడ్ సంరక్షణ కేంద్రం, కొవిడ్ ఆరోగ్య కేంద్రం, కొవిడ్ ఆసుపత్రి పేరుతో వీటిని వర్గీకరించాలని సూచించింది. రోగ తీవ్రత తక్కువ, మధ్యస్థాయి, ఎక్కువస్థాయిలో ఉన్న రోగులను వీటి మధ్య విభజించాలని స్పష్టంచేసింది.
- సంరక్షణ కేంద్రం
తక్కువ (మైల్డ్), అతి తక్కువ (వెరీ మైల్డ్), అనుమానిత కేసులను ఇక్కడ పెట్టాలి. ఇది తాత్కాలికం కావచ్చు. వసతిగృహాలు, హోటళ్లు, పాఠశాలలు, స్టేడియంలు, లాడ్జ్‌లు, ధర్మశాలల్లో వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. క్వారంటైన్ కేంద్రాలను కొవిడ్ సంరక్షణ కేంద్రాలుగానూ మార్చుకోవచ్చు. ఈ కేంద్రాన్ని ఆసుపత్రి, ఆరోగ్య కేంద్రంతో మ్యాపింగ్ చేయాలి. ఇక్కడున్న రోగులకు తదుపరి వైద్యసేవలు అవసరమైతే అందుకు అవసరమైన ప్రణాళిక తయారుచేసి సిద్ధంగా ఉంచుకోవాలి.
- ఆరోగ్య కేంద్రం