తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​పై కేంద్రం చేతికి 'ప్రత్యేక' అధికారాలు

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు చేసి, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా పునర్విభజన చేసిన కేంద్రం ఈ ప్రాంతంపై మరిన్ని అధికారాలను తన అధీనంలోకి తీసుకుంది. ఏఎఫ్​ఎస్​పీఏ కింద ఏదైనా ప్రాంతాన్ని 'కల్లోలిత ప్రాంతం'గా ప్రకటించే అధికారం కేంద్రం చేతిలోకి తీసుకుంటూ.. నోటిఫికేషన్​ జారీ చేసింది.

కశ్మీర్​పై కేంద్రం చేతికి 'ప్రత్యేక' అధికారాలు

By

Published : Nov 1, 2019, 7:02 PM IST

కేంద్ర పాలిత ప్రాంతాలుగా అవతరించిన జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​​లోని ఏదైనా ప్రాంతాన్ని సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్​ఎస్​పీఏ) కింద 'కల్లోలిత ప్రాంతం'గా ప్రకటించే అధికారాన్ని కేంద్రం చేతిలోకి తీసుకుంది. ఈ మేరకు నోటిఫికేషన్​ జారీ చేసింది కేంద్ర హోంశాఖ.

జమ్ముకశ్మీర్​ రాష్ట్ర పునర్విభజన చట్టం అమలులోకి వచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అధికారాలు ఉండేవి. ఏఎఫ్​ఎస్​పీఏ కింద రాష్ట్ర ప్రభుత్వమే ఏదైనా జిల్లా, పోలీస్​ స్టేషన్​ ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించేది. అయితే.. ప్రస్తుత నోటిఫికేషన్​ ప్రకారం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం(జమ్ముకశ్మీర్​) 1990.. ఇప్పటి నుంచి కేంద్ర హోంశాఖ పరిధిలోని జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​ వ్యవహారాల శాఖ అధీనంలోకి వస్తుంది.

కలహ ప్రాంతంగా ప్రకటిస్తేనే..

సాయుధ దళాల అవసరం ఏర్పడిన ప్రాంతాల్లో ఏఎఫ్​ఎస్​పీఎఫ్​ చట్టాన్ని అమలు చేస్తారు. ఏఎఫ్​ఎస్​పీఏ అమలులో ఉండాలంటే.. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని 'కల్లోలిత ప్రాంతగా' ప్రకటించాలి. అవిభక్త జమ్ముకశ్మీర్​లో 1990 నుంచి ఈ చట్టం అమలవుతోంది. అయితే.. లేహ్​, లద్దాఖ్​ ఇంతవరకు అల్లర్ల ప్రాంతంగా ప్రకటించని లద్దాఖ్​లో కలిశాయి.

లెఫ్టినెంట్​ గవర్నర్ల చేతిలోకి...

రాష్ట్ర పునర్విభజనతో.. రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలీస్​, శాంతిభద్రత వ్యవహారాలు కేంద్ర హోంశాఖ పరిధిలోని లెఫ్టినెంట్​ గవర్నర్ల చేతిలోకి వచ్చాయి. కేంద్ర హోంశాఖ పరిధిలోని జమ్ముకశ్మీర్​ వ్యవహారాల విభాగం పేరును జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​ వ్యవహారాల విభాగంగా మార్చారు.

నోటిఫికేషన్​ ప్రకారం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన విషయాలపై జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​ వ్యవహారాల విభాగం బాధ్యత వహిస్తుంది. ఇందులో ఉగ్రవాద నిర్మూలన, భారత్​-పాక్ మధ్య నియంత్రణ రేఖ నిర్వహణ వంటివి ఉన్నాయి.

ఇదీ చూడండి: ఫైర్​ అలారం పొరపాటు... ఇండిగో విమానంలో కలకలం

ABOUT THE AUTHOR

...view details