జాతీయ పౌర జాబితా(ఎన్ఆర్సీ) సిద్ధం చేసేందుకు జులై 31వరకు ఇచ్చిన గడువును పొడిగించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించాయి కేంద్రం,అసోం ప్రభుత్వం. తుది జాబితా రూపొందించేందుకు మరింత సమయం కావాలని విన్నవించాయి.
శరణార్థులకు భారత్ నిలయం కాకూదని సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనానికి తెలిపింది కేంద్రం. స్థానిక అధికారుల జోక్యంతో బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో లక్షల మంది అనర్హులకు ఎన్ఆర్సీలో చోటు కల్పించారని చెప్పింది. జాబితా నమూనాను పరిశీలించాలని కోరింది.