దేశంలో బర్డ్ ఫ్లూ కలకలం నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి పౌల్ట్రీ ఉత్పత్తుల సరఫరాపై నిషేధం విధించరాదని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. సరఫరాపై నిషేధం విధించడం పౌల్ట్రీ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఈ విధంగా సరఫరాపై నిషేధం విధించాయని, ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరింది.
ఆరోగ్యం, అటవీ శాఖలకు పరిస్థితిని వివరించి వారిని అప్రమత్తం చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. తగినంతగా సరఫరా ఉండేలా చూడడం సహ కోళ్లఫారాలలో బయోసెక్యూరిటీ చర్యలు చేపట్టాలని తెలిపింది. పౌల్ట్రీ రైతుల సంక్షేమం కోసం బర్డ్‌ఫ్లూపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొంది.