తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జలశక్తి: స్థానిక సంస్థలకు కేంద్రం మార్గదర్శకాలు

వర్షపు నీటిని రక్షించేందుకు నగర,పురపాలికలకు కేంద్రం ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. 'వర్షపు నీటి సంరక్షణ' విభాగాన్ని ప్రారంభించాలని కేంద్ర హౌజింగ్, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచనలు చేసింది.

జలశక్తి

By

Published : Jul 7, 2019, 4:41 PM IST

Updated : Jul 7, 2019, 7:47 PM IST

జలశక్తిపై స్థానిక సంస్థలకు కేంద్రం మార్గదర్శకాలు

పట్టణాలు, నగరాల్లో నీటి సంరక్షణకు కేంద్రం నడుం బిగించింది. వర్షపు నీటి సంరక్షణపై దృష్టి పెట్టింది. ఈ మేరకు నగర, పుర పాలికలకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి స్థానిక సంస్థ పరిధిలో 'వర్షపు నీటి సంరక్షణ' విభాగాన్ని ప్రారంభించాలని కేంద్ర హౌజింగ్, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. భూగర్భ జలాల స్థాయి పైనా ఈ విభాగం దృష్టి పెట్టాల్సిఉంటుంది.

జులై 1న జల్​శక్తి అభియాన్​ మొదటి దశలో భాగంగా నీటి సంరక్షణపై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. కేంద్రం సూచించిన అంశాలు...

  • భూగర్భ జలాల స్థాయిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి.
  • ఆ సమాచారాన్ని రద్దీ ప్రదేశాల్లో ప్రదర్శించాలి.
  • వర్షపు నీటి హార్వెస్టింగ్​కు ఇంకుడు గుంతలు ఉంటేనే భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలి.
  • మొదటి దశలో భాగంగా ప్రతి నగరం, పట్టణంలో కనీసంగా ఏదో ఒక నీటి వనరును కాపాడేలా చర్యలు తీసుకోవాలి.
  • సహజ జలాశయాలపై నిర్మాణాలు వరదలకు కారణమవుతాయి. వీటిని తొలగించాలి.
  • నీటి వనరుల సమీపంలో మొక్కల పెంపకం చేపట్టాలి.

దేశంలో 255 జిల్లాలు, 1,597 పట్టణాలు, 756 పాలికల్లో నీటి సమస్య ఉందని జల్​శక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇదీ చూడండి: నమో 2.0: నవ భారత నిర్మాణానికి 'జల్​శక్తి'

Last Updated : Jul 7, 2019, 7:47 PM IST

ABOUT THE AUTHOR

...view details