తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నూతన పార్లమెంటు ప్రాజెక్ట్​ రేసులో 3 పెద్ద సంస్థలు - పార్లమెంటు నూతన భవనం వార్తలు

నూతన పార్లమెంటు భవన నిర్మాణ ప్రాజెక్టుకు 3 అతిపెద్ద నిర్మాణ సంస్థలు పోటీలో ఉన్నాయి. ఆన్​లైన్​లో బిడ్లు దాఖలు చేసేందుకు లార్సెన్ అండ్ టబ్రో, షాపుర్​జీ పల్లోంజి, టాటా ప్రాజెక్ట్స్ సంస్థలు ఎంపికయ్యాయి. 2022 నాటికి సెంట్రల్​ విస్టా ప్రాజెక్టులో భాగంగా పార్లమెంటు భవనం సిద్ధం చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

Central vista project
నూతన పార్లమంటు భవనం నమూనా

By

Published : Aug 13, 2020, 1:21 PM IST

కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పార్లమెంటు నూతన భవన నిర్మాణానికి మూడు కంపెనీలు ఆన్​లైన్ బిడ్లు దాఖలు చేసేందుకు ఎంపికయ్యాయి. మొత్తం 7 కంపెనీలు ఆసక్తి చూపగా లార్సెన్ అండ్ టబ్రో, షాపుర్​జీ పల్లోంజి, టాటా సంస్థలు అర్హత సాధించాయని కేంద్ర ప్రజాపనుల శాఖ స్పష్టం చేసింది.

2022 నాటికి..

పార్లమెంటు, రాష్ట్రపతి భవన్​, మంత్రులు, ఎంపీల నివాసాల కోసం సెంట్రల్​ విస్టా రీడెవలప్​మెంట్ ప్రాజెక్టు చేపట్టింది మోదీ ప్రభుత్వం. దీనికింద దిల్లీలోని పార్లమెంటు హౌస్ స్టేట్​లోని 118 ప్లాట్ నంబర్​లో కొత్త భవనాన్ని నిర్మించనుంది.

ఈ భవనంలో గ్రౌండ్, బేస్​మెంట్​తో రెండు అంతస్తులు ఉంటాయి. 2022లో 75వ స్వాతంత్ర్య దినోత్సవాల సమయానికి ఈ భవనం సిద్ధం చేయాలని కేంద్రం భావిస్తోంది.

పనులు ముమ్మరం..

ఇప్పటికే ప్రాజెక్టుకు అవసరమైన భూములకు సంబంధించి దిల్లీ అభివృద్ధి ప్రాధికార సంస్థ ఆమోదం తెలిపింది. పార్లమెంటు కొత్త భవన నిర్మాణంతో పాటు ఇతర ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది.

ఇదీ చూడండి:మోదీ 2.0: పాలన కేంద్రంగా సెంట్రల్‌ విస్టా

ABOUT THE AUTHOR

...view details