తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సెంట్రల్​ విస్టా నిర్మాణం మంచిదే: కేంద్రం

దిల్లీలో రాష్ట్రపతి భవన్​ నుంచి ఇండియా గేట్​ వరకు నిర్మిస్తున్న సెంట్రల్​ విస్టా ఉపయోగకరమేనని కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానానికి నివేదించింది. ఈ నిర్మాణంతో పలు మంత్రిత్వ శాఖ చెల్లిస్తున్న అద్దె ఆదా అవుతుందని సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా ధర్మాసనానికి తెలిపారు.

By

Published : Nov 4, 2020, 7:35 AM IST

CENTRAL VISTA
సెంట్రల్​ విస్టా నిర్మాణం మంచిదే: కేంద్రం

దేశ రాజధానిలో వివిధ మంత్రిత్వశాఖలు అద్దె రూపేణా చెల్లిస్తున్న మొత్తాలను ఆదా చేయడంతో పాటు మెరుగైన సమన్వయం కోసమే 'రాష్ట్రపతి భవన్​ నుంచి ఇండియా గేట్​ వరకు మూడు కి.మీ మేర సెంట్రల్​ విస్టా ప్రాజెక్టు'ను తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. నూతన పార్లమెంటు భవనాన్ని నిర్మించే విషయంలో చట్ట నిబంధనల్ని ఉల్లంఘించలేదని తెలిపింది.

సెంట్రల్​ విస్టా నిర్మాణంపై పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్​ ఎం.ఎం ఖన్విల్కర్​ నేతృత్వంలోని ధర్మాసనానికి కేంద్రం తరపున సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా మంగళవారం వివరాలు నివేదించారు.

ఇదీ చదవండి:తృణమూల్​ కాంగ్రెస్​ నేతకు చెప్పుదెబ్బలు

ABOUT THE AUTHOR

...view details