కొత్త పార్లమెంటు భవన నిర్మాణ పనులు శుక్రవారం లాంఛనంగా మొదలయ్యాయి. మకర సంక్రాంతి ముగిసిన మరుసటి రోజును పవిత్రంగా భావించి ఈ పనులను ప్రారంభించింది నిర్మాణ కాంట్రాక్ట్ పొందిన టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్.
సెంట్రల్ విస్టా ఆధునికీకరణ ప్రాజెక్టులో భాగంగా కొత్త పార్లమెంటు భవనానికి డిసెంబర్ 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకు స్థాపన చేశారు.
ఒకేసారి 1,272 మంది ఎంపీలు కలిసి కూర్చోవడానికి అనుగుణంగా త్రిభుజాకారంలో కొత్త పార్లమెంటును నిర్మిస్తున్నారు. లోక్‌సభలో 888మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేలా ఇది నిర్మితం కానుంది. రూ.971కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన పార్లమెంటు భవనాన్ని 75వ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం.. గుత్తేదారు సంస్థకు లక్ష్యం నిర్దేశించింది.
ఇదీ చూడండి:సశక్త దేశానికి ఘన ప్రతీక మన పార్లమెంట్