తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాలం చెల్లిన వాహనాలు తగ్గాల్సిందే - financial ministry

దేశంలో కాలం చెల్లిన వాహనాలను తగ్గించడంపై కేంద్ర రవాణా, ఆర్థిక మంత్రిత్వ శాఖలు కసరత్తు చేస్తున్నాయి. మరోవైపు కొత్త వాహనాల కొనుగోళ్ల విషయంలో రిజిస్ట్రేషన్​ రుసుములను తగ్గించాలని కేంద్ర రవాణా శాఖ భావిస్తోంది.

కాలం చెల్లిన వాహనాలు తగ్గాల్సిందే

By

Published : Aug 30, 2019, 6:27 PM IST

Updated : Sep 28, 2019, 9:23 PM IST

కాలం చెల్లిన వాహనాలను తగ్గించేందుకు, కొత్తవాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు కేంద్ర రవాణా, ఆర్థిక మంత్రిత్వ శాఖలు కసరత్తు చేస్తున్నాయి. కాలం చెల్లిన వాహనాలపై అదనపు రుసుములు విధించేలా విధాన రూపకల్పనకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు కొత్త వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు రిజిస్ట్రేషన్‌ రుసుములను తగ్గించాలని కూడా కేంద్ర రవాణా శాఖ భావిస్తోంది.

  • దేశంలో దశాబ్దానికి పైబడిన వాహనాలు

2.80 కోట్లు

  • వాస్తవంగా వినియోగిస్తున్న కాలం

15-19 ఏళ్లు

  • వాహనాల సగటు వినియోగకాలం

10-12 ఏళ్లు

పాత వాహనాలను తగ్గించేందుకు ప్రతిపాదిస్తున్న చర్యలు ఇవి..

* 15ఏళ్ల పైబడిన వాహనాలను నియంత్రించడం.

* పాత వాహనాలను తుక్కుగా మార్చేందుకు రాయితీలు.

* రెన్యువల్‌ రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు రూ.15వేల వరకు పెంపు.

* ఏడాదికి రెండు సార్లు ఫిట్‌నెస్‌ ధ్రువపత్రాలు తప్పనిసరి.

పాత వాహనాలతో ముప్పు

* 65శాతం వాయు కాలుష్యానికి పాత వాణిజ్య వాహనాలే కారకాలు.

* బీఎస్‌-4 తో పోలిస్తే బీఎస్‌-1 కంటే ముందు నాటి వాణిజ్య వాహనాలు 25రెట్లు ఎక్కువగా వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి.

Last Updated : Sep 28, 2019, 9:23 PM IST

ABOUT THE AUTHOR

...view details