ద్విచక్ర వాహనాల్లో ప్రయాణాన్ని మరింత సురక్షితం చేసే దిశగా కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ చర్యలు చేపట్టింది. బైక్‌పై వెనకవైపు కూర్చున్న మహిళల చీర, చున్నీ వంటివి చక్రాల్లోకి వెళ్లిపోయి ప్రమాదాలకు కారణమవుతున్న దృష్ట్యా కొన్ని మార్పులు తీసుకురావాలని నిర్ణయించింది.
వెనక చక్రంలో కనీసం సగ భాగాన్ని కప్పి ఉంచేలా వాహన తయారీదారులు ఏర్పాట్లు చేయాలని, ఈ ఏడాది అక్టోబరు ఒకటో తేదీ లోగా ఇది అమలు జరగాలని ఆదేశించింది. వెనక వైపు కూర్చున్నవారు పట్టుకునేందుకు వీలుగా వాహనానికి పక్కన గానీ, డ్రైవరు సీటుకు వెనక గానీ ఒక హ్యాండిల్ తప్పనిసరిగా బిగించాలని, పాదాన్ని ఆన్చడానికి తగిన ఏర్పాట్లూ చేయాలని మంత్రిత్వశాఖ ఆదేశించింది.
ఇకపై ఇవి ఉండవు...