ప్రాణాంతక కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నట్టు కేంద్రం ఆరోగ్యశాఖ పునరుద్ఘాటించింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే లక్షకుపైగా ఐసోలేషన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయని.. కేవలం వైరస్ రోగుల చికిత్స కోసేం 586 ఆసుపత్రులను ఏర్పాటు చేసినట్టు వివరించింది.
ఇప్పటివరకు మొత్తం 1.7లక్షల మందిని పరీక్షించినట్టు ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. శుక్రవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 16,500 కరోనా పరీక్షలు జరిగినట్టు వివరించారు. 24 గంటల్లో 1035 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. మొత్తం మీద 7,447కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కరోనా నుంచి 642 మంది బాధితులు కోలుకున్నారని వివరించారు.