తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డబ్ల్యూహెచ్​ఓ కార్యనిర్వాహక మండలి ఛైర్మన్​గా హర్షవర్ధన్​

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) విధాన నిర్ణయాల్లో భారత్​ కీలకపాత్ర వహించనుంది. డబ్ల్యూహెచ్​ఓ కార్యనిర్వాహక మండలి ఛైర్మన్​గా బాధ్యతలు చేపట్టారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్​. ఆయన ఈ పదవిలో ఏడాది పాటు కొనసాగుతారు.

Central health minister appointed as WHO Executive Board chairman
డబ్ల్యూహెచ్​ఓ కార్యనిర్వాహక మండలి ఛైర్మన్​గా హర్షవర్ధన్​

By

Published : May 22, 2020, 5:02 PM IST

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కార్యనిర్వాహక మండలి ఛైర్మన్​గా కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్​ బాధ్యతలు చేపట్టారు. ఆయన ఈ పదవిలో ఏడాదిపాటు కొనసాగుతారు.

కార్యనిర్వహక మండలికి భారత్​ ప్రాతినిధ్యం వహించడానికి ఆమోదం తెలుపుతూ ప్రపంచ ఆరోగ్య సభ (డబ్ల్యూహెచ్‌ఏ)లోని 194 సభ్య దేశాలు మంగళవారం సంతకాలు చేశాయి.

ఏడాదికొకరు..

కార్యనిర్వహక మండలికి భారత్‌ను మూడేళ్ల పదవీకాలంతో ఎన్నుకోవాలని, ఛైర్మన్‌ పదవిని మాత్రం ఏడాదికొక ప్రాంతీయ కూటమి దేశానికి ఇవ్వాలని ఆగ్నేయాసియా సభ్య దేశాలు గతేడాదే తీర్మానించుకున్నాయి. దాని ప్రకారమే శనివారం(మే 22) నుంచి హర్షవర్ధన్‌ ఏడాది కాలం బోర్డు ఛైర్మన్‌గా ఉంటారు. తర్వాత రెండేళ్లు సభ్యుడిగా కొనసాగుతారు.

ఏడాదికి రెండు సార్లు

ఈ మండలిలో 34 సభ్య దేశాలుంటాయి. ఆ సభ్యదేశాలన్నీ ఆరోగ్య రంగంలో సాంకేతిక అర్హత కలిగి ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలోని సభ్య దేశాలు మూడేళ్ల కాలానికి మండలి సభ్యులను ఎన్నుకుంటారు. సాధారంగా ఈ మండలి జనవరి, మే నెలల్లో (ఏడాది రెండు సార్లు) సమావేశమవుతుంది. డబ్ల్యూహెచ్‌ఏ నిర్ణయాలను అమలు చేయించే పనిని బోర్డు చూస్తుంది.

ఇదీ చూడండి:డ్రగ్స్​ గ్యాంగ్​ అరెస్ట్- రూ.10 కోట్ల సరకు స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details