తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆ వివరాలు సమర్పించకపోతే చర్యలు తప్పవు' - coronavirus updates

కరోనా క్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఔషధ సంస్థలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్ నిల్వల వివరాలు సమర్పించాలని ఆదేశించింది. వివరాలు తెలపని సంస్థలు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని స్పష్టం చేసింది.

corona
'ఆ వివరాలు సమర్పించకపోతే చర్యలు తప్పవు'

By

Published : Mar 18, 2020, 9:29 PM IST

మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్ నిల్వల వివరాలు సమర్పించని సంస్థలు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయా వస్తువుల ఉత్పత్తిదారులు, దిగుమతిదారులను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. అందుకు ఇచ్చిన గడువు బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ ఈ హెచ్చరికను జారీ చేసింది.

నిత్యావసరాలుగా ప్రకటన..

దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో నిరోధక చర్యల్లో భాగంగా ప్రభుత్వం మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు అందరికీ అందుబాటులోకి ఉండేందుకు, వాటి ధరలు, అమ్మకాలలో అక్రమాలను నివారించేందుకు ఈ వస్తువులను నిత్యావసరాలుగా ప్రకటించింది. ఈ పరిధిలోకి సర్జికల్‌ మాస్కులు, ఎన్‌ 95 మాస్కులు కూడా వస్తాయని తెలిపింది. ఈ నిబంధనలు మార్చి 13 నుంచి 100 రోజుల పాటు అమల్లో ఉంటాయి. పై వస్తువుల ఉత్పత్తి, ధరల అదుపు, అక్రమ సరఫరాను నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారమిచ్చింది. అంతేకాకుండా ఈ వస్తువులకు సంబంధించిన నిల్వల వివరాలను ఈ నెల 18 సాయంత్రం 6 గంటలలోగా ఇవ్వాలంటూ సంబంధిత సంస్థలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

శిక్ష తప్పదు..

అయితే మాస్కులు, సర్జికల్‌ గ్లౌజులు, హ్యాండ్‌ శానిటైజర్ల గురించిన అవసరమైన సమాచారాన్ని ఇప్పటి వరకు చాలా కొద్ది మంది తయారీదారులు, దిగుమతిదారులు మాత్రమే సమర్పించారు. ఈ నేపథ్యంలో ఆదేశానుసారం వివరాలను సమర్పించని వారిపై నిత్యావసర వస్తువుల చట్టం కింద చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. చర్యల్లో భాగంగా తనిఖీలు, జప్తు మాత్రమే కాకుండా చట్టపరమైన శిక్షకు కూడా లోనవుతారని అధికారులు హెచ్చరించారు.

ఇదీ చూడండి:కరోనా అనుమానం- రైలు నుంచి దింపాలని ప్రయాణికుల పట్టు

ABOUT THE AUTHOR

...view details