బ్యాంకు మోసాలకు సంబంధించిన కేసుల విషయమై దేశవ్యాప్తంగా 169 ప్రాంతాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఆధ్వర్యంలో ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు రూ.7 వేల కోట్ల మేర జరిగిన బ్యాంకు మోసాలకు సంబంధించి 35 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఆంధ్రాబ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు, కెనరా బ్యాంకు, దేనా బ్యాంకు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా, ఐడీబీఐ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియాల్లో ఆర్థిక మోసాలు జరిగినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు.