తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీబీఎస్​ఈ 'పది' ఫలితాలు వచ్చేశాయ్​- బాలికలదే హవా

Central Board of Secondary Education
సీబీఎస్​ఈ 10వ తరగతి ఫలితాలు వచ్చేశాయ్​

By

Published : Jul 15, 2020, 12:40 PM IST

Updated : Jul 15, 2020, 1:16 PM IST

12:56 July 15

దిల్లీలోని సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్యుకేషన్ ​(సీబీఎస్​ఈ) దేశవ్యాప్తంగా పదవ తరగతి ఫలితాలు విడుదల చేసింది. ఈ సందర్భంగా మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్​ 'నిషాంక్​' ట్విట్టర్​లో ఓ పోస్ట్​ చేశారు.​

"ప్రియమైన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు... సీబీఎస్​ఈ ఫలితాలు విడుదలయ్యాయి. పదో తరగతి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు​"

-రమేశ్​ పోఖ్రియాల్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి

కరోనా మహమ్మారి నేపథ్యంలో పరీక్షలను రద్దు చేసిన సీబీఎస్​ఈ బోర్డు.. విద్యార్థులు పూర్వ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఫలితాలను ప్రకటించింది.

  1. సీబీఎస్​ఈ పరీక్షల ఉత్తీర్ణత శాతం గత ఏడాదితో పోలిస్తే పెరిగింది. మొత్తం 91.46 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
  2. మొత్తం 1.84 లక్షల మంది విద్యార్థులు 90 శాతానికి పైగా మార్కులు సాధించారు. 41 వేల మందికిపైగా 95 శాతానికి మించి మార్కులు గడించారు.
  3. బాలురతో పోలిస్తే బాలికల ఉత్తీర్ణత 3.17 శాతం ఎక్కువ.
  4. త్రివేండ్రం ప్రాంతం 99.28 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానం కైవసం చేసుకుంది. గువాహటి ప్రాంతం 79.12 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో ఉంది.
  • అన్ని పరీక్షలు రాసిన 10 తరగతి విద్యార్థుల ఫలితాలను యథావిధిగా ప్రకటించారు.
  • మూడు లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు రాసిన విద్యార్థులకు మాత్రం.. అత్యుత్తమ మార్కులు సాధించిన మూడు సబ్జెక్టుల సగటు ఆధారంగా ప్రతిభను మదింపు చేశారు.
  • 3 సబ్జెక్టులకు మాత్రమే హాజరైన విద్యార్థులకు.. 2 సబ్జెక్టులలో సాధించిన అత్యుత్తమ మార్కుల సగటు, అంతర్గత, ప్రాక్టికల్‌ పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా తుది మార్కులు కేటాయించారు.
  • 12వ తరగతి విద్యార్థులకు సీబీఎస్‌ఈ బోర్డు ఇంకో అవకాశాన్ని ఇచ్చింది. మదింపు ఆధారంగా వచ్చిన మార్కులపై అసంతృప్తిగా ఉంటే.. ఆ విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహించనుంది. పదో తరగతి విద్యార్థులకు మాత్రం ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు రాసే అవకాశం లేదని బోర్డు ఇదివరకే స్పష్టం చేసింది.

12:38 July 15

సీబీఎస్​ఈ 10వ తరగతి ఫలితాలు వచ్చేశాయ్​

సీబీఎస్​ఈ 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలు cbseresullts.nic.in వెబ్​సైట్​లో చూడొచ్చు.

Last Updated : Jul 15, 2020, 1:16 PM IST

ABOUT THE AUTHOR

...view details