తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్​ఈపీ అమలుపై సూచనలు కోరిన కేంద్రం - జాతీయ విద్యా విధానం

ఎన్​ఈపీ అమలుకు సంబంధించి ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్ల నుంచి సలహాలు, సూచనలు కోరింది కేంద్రం. ఈ మేరకు కేంద్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి అనితా కర్వాల్​ దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులకు లేఖ రాశారు.

center seeks suggestions for implementation of nep2020
ఎన్​ఈపీ అమలుపై సూచనలు కోరిన కేంద్రం

By

Published : Aug 24, 2020, 8:15 AM IST

జాతీయ విద్యావిధానం(ఎన్​ఈపీ) అమలు ప్రక్రియను ఎలా ప్రారంభిస్తే బాగుంటుందో ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్ల సలహాలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి అనితా కర్వాల్​ దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులకు లేఖ రాశారు.

" పాఠశాల విద్యకు సంబంధించిన అంశాలపై ప్రశ్న-సమాధానం రూపంలో ఉపాధ్యాయుల నుంచి సూచనలు ఆహ్వానిస్తున్నాం. ప్రతి ప్రశ్న జాతీయ విద్యావిధానంలోని ఏదో ఒక పేరాకు సంబంధించి ఉంటుంది. అందువల్ల ఉపాధ్యాయులు ఆ ప్రశ్నకు సంబంధించిన పేరాను చదివి అర్థం చేసుకున్న తర్వాత సూచనలు, సలహాలు అప్​లోడ్​ చేయొచ్చు. ఇలా వచ్చే అన్ని సలహాలను పరిశీలించడానికి ఎన్​సీఈఆర్​టీ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం సూచనలను పరిమిత పదాల్లో స్వీకరిస్తున్నప్పటికీ, అందులో ఎంపిక చేసిన వాటిపై తదుపరి విస్తృత సమాచారం తీసుకుంటాం. ఆసక్తి కలవారు https://innovateindia.mygov.in/nep2020 వెబ్​ అడ్రస్​కు వెళ్లి తొలుత వివరాలు రిజస్టర్ చేసుకోవాలి. తర్వాత అధ్యాయాల వారీగా ప్రశ్నలను ఎంచుకోవాలి. ఉపాధ్యాయులు తమ సొంత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సూచనలు చేయాలి. అన్ని ప్రభుత్వ, ప్రేవేటు ఉపాధ్యాయులందరూ వీటిని పంపిచవచ్చు. ఈ నెల 24 నుంచి 31వ తేదీలోగా వీటిని అప్​లోడ్ చేయాలి. వాట్సాప్ గ్రూపులు, విడీయో సమావేశాల ద్వారా ఈ విషయాన్ని ఉపాధ్యాయులకు తెలియజేయాలి' అని లేఖలో పేర్కొన్నారు.

ఇదీ చూడండి: కాంగ్రెస్​ పగ్గాలు ఎవరికి? నేడు సీడబ్ల్యూసీ కీలక భేటీ

ABOUT THE AUTHOR

...view details