తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నేర' నేతల నిషేధం‌పై కేంద్రం అఫిడవిట్​ - న్యాయస్థానాలు

నేరారోపణలు రుజువైన నేతలు, ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయాధికారులపై జీవితకాలం నిషేధం విధించాలన్న పిటిషన్​పై కేంద్రం.. సుప్రీం కోర్టులో అఫిడవిట్​ దాఖలు చేసింది. జీవితకాల నిషేధం విధించాలన్న అభ్యర్థనను తీవ్రంగా వ్యతిరేకించింది.

Center responding to leaders lifetime ban petition
నేతల జీవితకాలం నిషేధం పిటిషన్‌పై స్పందించిన కేంద్రం

By

Published : Dec 3, 2020, 3:14 PM IST

నేరారోపణలు రుజువైన ప్రజాప్రతినిధులపై జీవితకాలం నిషేధం విధించాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను కేంద్ర ప్రభుత్వం తప్పుబట్టింది. అశ్వినీ కుమార్‌ ఉపాధ్యాయ వేసిన వ్యాజ్యాన్ని కొట్టివేయాలని సుప్రీంకోర్టుకు విన్నవించింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానంలో అఫిడవిట్‌ దాఖలు చేసింది.

ఇప్పటికే కోర్టులో నేతలపై కేసుల సత్వర విచారణ అభ్యర్థన విచారణ దశలో ఉందన్న కేంద్రం.. మరో పిటిషన్‌ అవసరం లేదని కోర్టుకు తెలిపింది. ఐపీసీ సెక్షన్ల ప్రకారం ప్రజాప్రతినిధులపై శిక్షల విషయంలో ఎలాంటి వివక్ష లేదని కోర్టుకు స్పష్టం చేసింది.

నేతల విచారణ సందర్భంగా న్యాయస్థానాలు.. శిక్ష విధింపుపై ఇప్పటికే పలు ఆదేశాలు ఇస్తున్నట్లు పేర్కొంది.

ఇదీ చూడండి: మార్పు మంత్రంతో రజనీ రాజకీయం- జనవరిలో ఎంట్రీ

ABOUT THE AUTHOR

...view details