పండుగ సీజన్ నేపథ్యంలో విమాన సర్వీసులు పెంచాలని కేంద్రం యోచిస్తోంది. ఆ దిశగా చర్యలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. సంబంధిత సంస్థలు, భాగస్వామ్య పక్షాలతో పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఈమేరకు చర్చలు జరుపుతోంది.
విమానయాన సంస్థలు ప్రస్తుతం 50 శాతం సామర్థ్యంతో సర్వీసులు నడుపుతుండగా.. త్వరలోనే సాధారణ స్థితికి వస్తాయని కేంద్ర మంత్రి హర్‌దీప్‌పూరి అన్నారు. వచ్చే 30-40 రోజుల్లో సామర్థ్యాన్ని 80 శాతానికి పైగా పెంచే అవకాశముందన్నారు.