తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జనాభా లెక్కలు ఈ ఏడాది లేనట్టే! - జనాభా లెక్కలు

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జనగణన తొలి విడత సహా ఎన్​పీఆర్ అప్​డేట్​ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. ఏప్రిల్​లో ప్రారంభం కావాల్సిన ఈ కార్యక్రమం.. ప్రస్తుతానికి నిలిచిపోయింది. అయితే మరో ఏడాది వరకు ఈ ప్రక్రియ వాయిదా పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Census, NPR unlikely in 2020
జనగణన, ఎన్​పీఆర్ ప్రక్రియ మరింత ఆలస్యం!

By

Published : Aug 30, 2020, 4:19 PM IST

తొలి దశ జనాభా లెక్కింపు సహా జాతీయ జనాభా పట్టిక(ఎన్​పీఆర్)ను అప్​డేట్ చేసే ప్రక్రియ మరో ఏడాది పాటు వాయిదా పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కార్యక్రమాలు ప్రారంభం కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే మహమ్మారి వ్యాప్తి ఇప్పట్లో తగ్గే అవకాశం లేనందున.. ఈ ప్రక్రియను వచ్చే సంవత్సరం నిర్వహించనున్నట్లు అధికారులు చెబుతున్నారు..

"ప్రస్తుతానికి జనగణన అంత ముఖ్యమైన అంశం కాదు. ఇంకో సంవత్సరం వాయిదా పడినా ప్రమాదమేమీ లేదు."

-సీనియర్ అధికారులు

జనగణన తొలి దశ సహా ఎన్​పీఆర్ అప్​డేట్ ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందనే విషయంపై తుది నిర్ణయం తీసుకోలేదని అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది మాత్రం జరిగే అవకాశాలు దాదాపుగా లేవని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ కోసం సిబ్బంది, అధికారులు లక్షల్లో అవసరమవుతారని.. ఇంటింటికీ వెళ్లి సమాచారం సేకరించడం ఇప్పుడు సాధ్యం కాదని అన్నారు.

"మొత్తం ప్రక్రియలో లక్షల మంది అధికారులు.. ప్రతి ఇంటికీ వెళ్లాల్సి వస్తుంది. కరోనా నేపథ్యంలో వారి ఆరోగ్యానికి ఏర్పడే ముప్పును పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వానికి జనగణన, ఎన్​పీఆర్​ ప్రాధాన్యాంశాలు కాదు."

-అధికారులు

షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య జనగణన తొలి విడత నిర్వహించాల్సి ఉంది. కరోనా కారణంగా ప్రస్తుతానికి వీటిని నిలిపివేశారు.

ABOUT THE AUTHOR

...view details