మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండటానికి యోగా ఎంతగానో తోడ్పడుతుంది. ఆరో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచమంతా ఘనంగా జరుపుకుంటోంది. కరోనా వల్ల ప్రముఖలంతా తమ నివాసాల్లోనే ఆసనాలు వేసి... యోగా ప్రాముఖ్యాన్ని చాటిచెప్పారు.
రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన అధికారిక నివాసంలో యోగా దినోత్సవం సందర్భంగా పలు ఆసనాలు వేశారు రామ్‌నాథ్. ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కూడా తమ నివాసంలోనే యోగా చేశారు.
పద్మాసనంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ యోగా సాధనలో వెంకయ్య నాయుడు కుటుంబ సమేతంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పీకర్
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా యోగాసనాలు వేశారు. ఆయన నివాసంలోనే ప్రాణాయామం, పద్మాసనం, శీర్షాసనం వంటివి వేశారు.
ప్రాణాయామంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కేంద్ర మంత్రులు
పలువురు కేంద్ర మంత్రులు తమ నివాసాల్లో ఆసనాలు వేసి... యోగా ప్రాముఖ్యతను చాటిచెప్పారు. ప్రహ్లాద్ పటేల్, గిరిరాజ్ సింగ్, ప్రకాష్ జవడేకర్ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముక్తార్ అబ్బాస్ నఖ్వీ యోగాసనాలు వేశారు. మరో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కుటుంబ సమేతంగా యోగా చేశారు.
యోగా సాధనలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ కుటుంబ సమేతంగా యోగా సాధనలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పలువురుతో కలిసి యోగా చేస్తున్న ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ముఖ్యమంత్రులు
రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగా దినోత్స ప్రాముఖ్యతను చాటిచెప్పేలా ఆసనాలు వేశారు. ఇందులో భాగంగా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉత్తరాఖండ్ సీఎం తివేంద్ర సింగ్ రావత్, ఛత్తీస్గఢ్ సీఎం భుపేష్ బగేల్ ఆసనాలు వేశారు.
శీర్షాసనంలో ఛత్తీస్గఢ్ సీఎం భుపేష్ బగేల్ కుటుంబ సమేతంగా ఉత్తరాఖండ్ సీఎం పద్మాసనంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇదీ చూడండి:18వేల అడుగుల ఎత్తులో ఐటీబీపీ సిబ్బంది యోగాసనాలు