తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బ్యాలెట్​ ఎన్నికల నిర్వహణ అసాధ్యం: అరోడా - సుప్రీం కోర్టు

ఎన్నికల్లో బ్యాలెట్​ పేపర్ల విషయంపై సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను పాటిస్తామని సీఈసీ సునీల్​ అరోడా స్పష్టం చేశారు. ఈవీఎంలను పక్కనపెట్టి బ్యాలెట్​ పేపర్లను వినియోగించేది లేదని తేల్చిచెప్పారు.

బ్యాలెట్​ ఎన్నికల నిర్వహణ అసాధ్యం: అరోడా

By

Published : Aug 10, 2019, 5:53 AM IST

బ్యాలెట్​ ఎన్నికల నిర్వహణ అసాధ్యం: అరోడా

ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లు వినియోగించేది లేదని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోడా స్పష్టం చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను పక్కనబెట్టి, మళ్లీ బ్యాలెట్ పేపర్లను వినియోగించే అవకాశం లేదని తెలిపారు.

"మళ్లీ బ్యాలెట్​ యుగానికి వెళ్లబోయేది లేదు. అది గత చరిత్ర అని సుప్రీం కోర్టు చాలా సార్లు స్పష్టం చేసింది."

-సునీల్​ అరోడా, సీఈసీ

ఈవీఎంలను తారుమారు చేయడానికి అవకాశం ఉందని కొంత కాలంగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్​​, తెలుగుదేశం, నేషనల్ కాన్ఫరెన్స్, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన వంటి పార్టీలు ఈవీఎంలను వదిలిపెట్టి, బ్యాలెట్​ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details