తెలంగాణ

telangana

ETV Bharat / bharat

18 రాష్ట్రాల్లోని 64 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు - ఈసీ

18 రాష్ట్రాల్లోని శాసనసభ ఉపఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్​ విడుదల చేసింది. మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు భారత ప్రధాన ఎన్నికల అధికారి సునీల్​ అరోడా తెలిపారు. మొత్తం 64 స్థానాలకు అక్టోబర్​ 21న ఎన్నికలు, 24న లెక్కింపు, ఫలితాలు ఉంటాయని వెల్లడించారు.

18 రాష్ట్రాల్లోని 64 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు

By

Published : Sep 21, 2019, 3:16 PM IST

Updated : Oct 1, 2019, 11:27 AM IST

మహారాష్ట్ర, హరియాణా శాసనసభ ఎన్నికలతోపాటే 18 రాష్ట్రాల్లోని 64 శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో అత్యధికంగా కర్ణాటకలో 15 నియోజకవర్గాలు ఉన్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హతవేటు వేయడం వల్ల ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.

కర్ణాటక తర్వాత అత్యధికంగా ఉత్తర ప్రదేశ్‌లోని 11 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనుండగా.. కేరళ, బిహార్‌లలో ఐదేసి, గుజరాత్‌, అసోం, పంజాబ్‌లలో నాలుగేసి స్థానాలకు అక్టోబర్‌ 21నే ఉప ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నారు. సిక్కింలో 3, రాజస్థాన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, తమిళనాడుల్లో రెండేసి, అరుణాచల్‌ ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, మేఘాలయ, ఒడిషా, పుదుచ్చేరిల్లోని ఒక్కో స్థానానికి షెడ్యూల్​ విడుదల చేసింది ఈసీ.

తెలంగాణలో...

తెలంగాణలోని హుజూర్‌నగర్‌ నియోజకవర్గానికి కూడా అక్టోబర్‌ 21నే పోలింగ్‌ ఉంటుందని తెలిపారు భారత ప్రధాన ఎన్నికల అధికారి సునీల్​ అరోడా. ఈ ఉప ఎన్నికల ఫలితాలను అక్టోబర్‌ 24నే వెల్లడిస్తామని చెప్పారు. బిహార్‌లోని సమస్తిపూర్‌ లోక్‌సభ స్థానానికి కూడా ఈ షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.

ఉప ఎన్నికల రాష్ట్రాలు స్థానాలు
కర్ణాటక 15
ఉత్తర ప్రదేశ్‌ 11
కేరళ 05
బిహార్‌ 05
గుజరాత్‌ 04
అసోం 04
పంజాబ్‌ 04
సిక్కిం 03
రాజస్థాన్‌ 02
హిమాచల్‌ ప్రదేశ్‌ 02
తమిళనాడు 02
అరుణాచల్‌ ప్రదేశ్‌ 01
ఛత్తీస్‌గఢ్‌ 01
మధ్యప్రదేశ్‌ 01
మేఘాలయ 01
ఒడిషా 01
పుదుచ్చేరి 01
తెలంగాణ

01

ఇదీ చూడండి: మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు

Last Updated : Oct 1, 2019, 11:27 AM IST

ABOUT THE AUTHOR

...view details