తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సీడీఎస్​'తో రాజ్​నాథ్​ భేటీ.. చైనా సరిహద్దుపై చర్చ

భారత్​-చైనాల మధ్య తూర్పు లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ప్రతిష్టంభనపై సీడీఎస్​, త్రివిద దళాల అధినేతలతో సమీక్ష నిర్వహించారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. ఈ సందర్భంగా ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తులో తీసుకోబోయే చర్యలపై రక్షణ మంత్రికి వివరించారు సీడీఎస్​ రావత్​.

General Bipin Rawat
చైనాతో సరిహద్దు ప్రతిష్టంభనపై 'సీడీఎస్​'తో రాజ్​నాథ్​ భేటీ

By

Published : Jun 8, 2020, 8:01 PM IST

చైనాతో తూర్పు లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ (ఎల్​ఎసీ) వెంబడి నెలకొన్న ప్రతిష్టంభన నెలరోజులకుపైగా కొనసాగుతోంది. సమస్య శాంతియుత పరిష్కారానికి రెండు రోజుల క్రితం ఇరుదేశాల సైనికాధికారులు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో సరిహద్దులోని పరిస్థితులపై త్రిదళాధినేత(సీడీఎస్) జనరల్​ బిపిన్​ రావత్​తో పాటు త్రివిద దళాల అధినేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​.

ఈ సందర్భంగా సరిహద్దు అంశంలో తదుపరి తీసుకోబోయే చర్యలపై రాజ్​నాథ్​కు వివరించారు రావత్​. జూన్​​ 6న ఇరు దేశాల సైనికాధికారుల సమావేశంలోని కీలక అంశాలపైనా చర్చించినట్లు సైనిక వర్గాలు తెలిపాయి.

ఇటీవలి చర్చలతోపాటు భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై రక్షణ మంత్రి సమీక్షించారు. ఈ భేటీలో భారత్​కు ఇబ్బంది అనిపించే సమస్యలపై ప్రణాళిక రూపొందించటం జరిగింది. సరిహద్దులో ప్రతిష్టంభన, భవిష్యత్తు కార్యాచరణపై సుమారు గంటకుపైగా చర్చించారు.

- సైనిక వర్గాలు.

ఇదీ చూడండి: భారత్​తో సరిహద్దు రగడపై చైనా శాంతి మంత్రం!

ABOUT THE AUTHOR

...view details