తెలంగాణ

telangana

By

Published : Jan 3, 2020, 6:31 AM IST

Updated : Jan 3, 2020, 6:39 AM IST

ETV Bharat / bharat

సీడీఎస్​ మొదటి సంకల్పం 'ఎయిర్​ డిఫెన్స్ కమాండ్​'

భారత గగనతలం భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు 'ఎయిర్ డిఫెన్స్ కమాండ్​' ఏర్పాటుచేయాలని త్రిదళాధిపతి​ బిపిన్ రావత్​ సంకల్పించారు. ఇందుకోసం జూన్​ 30లోగా ఓ ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. త్రిదళాల ప్రధానాధికారిగా బాధ్యతలు చేపట్టిన తరువాత బిపిన్ రావత్​ తీసుకున్న తొలి నిర్ణయం ఇదే కావడం గమనార్హం.

CDS bipin rawat focuses on preparing roadmap for creation of an air defence command
సీడీఎస్​ మొదటి సంకల్పం 'ఎయిర్​ డిఫెన్స్ కమాండ్​'

భారత చీఫ్ ఆఫ్​ డిఫెన్స్​ స్టాఫ్ బిపిన్​ రావత్... ​త్రిదళాల ప్రధానాధికారిగా బాధ్యతలు చేపట్టిన తరువాత​ మొదటిసారిగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత గగనతలం భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు 'ఎయిర్​ డిఫెన్స్​ కమాండ్​' ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఇందుకోసం జూన్​ 30లోగా ఓ ప్రణాళిక తయారుచేయమని అధికారులను ఆదేశించారు.

త్రివిధ దళాల సమన్వయం

త్రివిధ దళాల సమాహారంతో ఓ సైనిక స్థావరం నిర్మించేందుకు కొన్ని ప్రాంతాలను గుర్తించారు. ఇలాంటి రెండు మూడు స్థావరాల మధ్య మంచి సమన్వయంతో... సైనిక వ్యూహాన్ని పక్కాగా చేపట్టేందుకుకు 'లాజిస్టిక్స్​ సపోర్ట్​ పూల్​' ఏర్పాటుచేయాలని సీడీఎస్​ భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

సైనిక, వాయు, నావికా దళాల మధ్య సమన్వయం సాధించడానికి... ఈ ఏడాది చివరిలోపు వివిధ కార్యక్రమాలు చేపట్టాలని కూడా బిపిన్​ రావత్ నిర్ణయించారు.

ఇదీ చూడండి:'పౌరచట్టంపై కాదు.. పాక్​కు వ్యతిరేకంగా నిరసనలు చేయండి'

Last Updated : Jan 3, 2020, 6:39 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details