తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీసీ నిఘాలో చెన్నై టాప్- హైదరాబాద్​ సెకెండ్

సీసీటీవీ నిఘాపై ఇటీవలె ఓ సంస్థ చేపట్టిన సర్వేలో చెన్నై మొదటి స్థానంలో నిలిచింది. తర్వాత స్థానాల్లో హైదరాబాద్, హార్బిన్​, లండన్, జియామెన్​ నగరాలు నిలిచాయి.

By

Published : Jan 5, 2021, 5:05 PM IST

chennai tops in cctv survey
సీసీ నిఘాలో చెన్నై టాప్

చదరపు కిలోమీటరు పరిధిలో అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న నగరాల్లో చెన్నై అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల్లో సీసీ కెమెరాల సంఖ్యపై నిర్వహించిన ఓ సర్వే ద్వారా ఈ విషయం తెలిసింది.

రెండో స్థానంలో భాగ్యనగరం..

చెన్నై తర్వాత స్థానంలో హైదరాబాద్ నిలిచింది. చెన్నైలో చదరపు కిలోమీటరుకు 657 సీసీ కెమెరాలు ఉండగా, హైదరాబాద్​లో ఆ సంఖ్య 480గా ఉంది. మూడో స్థానంలో చైనాలోని హార్బిన్​ (411 కెమెరాలు), నాలుగో స్థానంలో లండన్ (399 కెమెరాలు), ఐదో స్థానంలో చైనాలోని జియామెన్​ నగరాలు నిలిచాయి. మొత్తంగా చెన్నైలో 2.70 లక్షల సీసీటీవీలు ఉండగా, హైదరాబాద్​లో 3 లక్షల సీసీ కెమెరాలు ఉండటం గమనార్హం.

ఇదీ చదవండి :హీరా గోల్డ్ కేసు.. సొమ్ము ఎలా చెల్లిస్తారో నివేదించండి : సుప్రీంకోర్టు

ABOUT THE AUTHOR

...view details