తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వైరల్​: కారు డోర్​ను ఢీకొని బైకర్​ మృతి - cctv footages

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా డోర్ తీయడం వల్ల ఓ బైకర్​ ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన ప్రమాద దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతున్నాయి.

CCTV footage of the horrific accident in karnataka
వైరల్​: స్కార్పియో తలుపుల్ని ఢీకొని బైకర్​ మృతి

By

Published : Oct 10, 2020, 12:31 PM IST

వైరల్​: స్కార్పియో తలుపుల్ని ఢీకొని బైకర్​ మృతి

కర్ణాటకలోని చిక్కబల్లాపుర్​ జిల్లా గౌరిబిదనూర్​లో రోడ్డు ప్రమాదం జరిగింది. స్కార్పియో డోర్​ను ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే తుదిశ్వాస విడిచాడు.

అసలేం జరిగింది?
రోడ్డు పక్కనే స్కార్పియో వాహనాన్ని ఆపిన ఆ ఎస్​యూవీ డ్రైవర్​.. వెనక వచ్చే వాహనాలను చూడకుండా కారు డోర్​ను తెరిచాడు. వెనక నుంచి ఓ ద్విచక్ర వాహనదారుడు వేగంగా దూసుకొచ్చాడు. కారు తలుపును ఢీకొట్టి​.. రోడ్డుపై వెళ్తున్న మరో వాహనం కింద పడి ప్రాణాలు కోల్పోయాడు ఆ బైకర్. గౌరిబిదనూర్​ బీహెచ్​ రోడ్డులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుడిని గౌరిబిదనూర్​ వాసి నాగరాజ్​గా గుర్తించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. సీసీకెమెరాల్లో నమోదైన ప్రమాద దృశ్యాలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ఇదీ చూడండి:బస్తు బోల్తా- ముగ్గురు మృతి, ఐదుగురికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details